Karthika Deepam 7 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 1293 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వజన్మకృతం పాపం అంటారు. పోయిన జన్మలో చేసిన పాపాలు కొన్ని వెంటాడుతాయి అంటారు అంటాడు పూజారి. కొన్ని స్థల ప్రభావాలు విచిత్రంగా ఉంటాయి. నాకెందుకో మనసులో ఏదో అలజడిగా అనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వీలైతే వెనక్కి వచ్చేయమని చెప్పండి అంటాడు పూజారి. మరోవైపు మోనిత.. కార్తీక్ తో దిగిన ఫోటోనే చూస్తూ ఉంటుంది. గన్ పట్టుకొని కార్తీక్ వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో అరుణ, విన్నీ వస్తారు. తన చేతుల్లో ఉన్న గన్ ను చూసి షాక్ అవుతారు. అమ్మ.. తుపాకీ పట్టుకున్నారేంటి అమ్మా.. ఇలా ఇవ్వండి అమ్మ అంటుంది అరుణ.
దీంతో వెళ్లి కాఫీ పట్టుకురా అంటుంది మోనిత. ఆనంద్ రావు గారు నిద్ర లేస్తారు.. పాలు కలిపి ఇవ్వు అంటుంది విన్నీ. అమ్మా.. మీ బాధ నాకు అర్థం అవుతోంది. ఏం కాదమ్మా.. దేవుడు ఉన్నాడు అంటుంది అరుణ. దీంతో అరుణకు గన్ గురిపెడుతుంది మోనిత. దేవుడు అన్నావంటే చంపేస్తా. ఏం చేశాడు ఆ దేవుడు. అడిగింది ఏం ఇచ్చాడు. ఇచ్చినట్టే ఇచ్చి అన్నీ లాగేసుకున్నాడు. అందుకే ఇక నుంచి దేవుడు అన్న పదం నాకు వినిపించకూడదు. వినిపించిందా.. అంటూ ఆవేశపడుతుంది. తర్వాత సారీ అరుణ.. అంటుంది. వెళ్లి భోం చేయి అంటుంది మోనిత. దేవుడికన్నా నిన్ను నమ్ముకుంటేనే నాకు మంచి జరుగుతుంది అని అని అనుకుంటుంది మోనిత.
మరోవైపు కార్తీక్ ఫ్యామిలీ కారులో చిక్ మగళూరుకు వెళ్తారు. అక్కడ ఒక కేఫ్ గుర్తొస్తుంది కార్తీక్ కు. అప్పట్లో ఆ కేఫ్ లోనే దీపను కార్తీక్ అపార్థం చేసుకుంటాడు. అదే గుర్తొస్తుంది కార్తీక్ కు. ఒక చోట కారును ఆపుతాడు కార్తీక్. అక్కడ కొలను ఉండటంతో అక్కడికి వెళ్లి పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తారు.
జీవితం ఎంత చిత్రమైనది. ఎన్నెన్ని మెమోరీస్ ను అందిస్తుంది అని అనుకుంటుంది దీప. ఇక్కడే మేము అప్పుడు వర్షంలో తడిశాం అని గుర్తు చేసుకుంటుంది దీప. ఒక్కసారి నా జీవితంలో అనుమానం మొదలైంది. అదే పెనుభూతమై నన్ను, కార్తీక్ బాబును విడదీసింది ఇక్కడే అని అనుకుంటుంది దీప.
పతితులార.. భ్రష్టులారా.. బాధాతప్త భ్రష్టులారా అంటూ తనలో తానే ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ చూసి దీప అంటాడు. సారీ దీప.. నేను చాలా మూర్ఖంగా.. రాక్షసంగా ప్రవర్తించాను అంటాడు కార్తీక్. రత్నాల్లాంటి ఇద్దరు అమ్మాయిలను ఇచ్చావు నాకు. కానీ.. నాకు ఏమైందో తెలియదు అప్పుడు. అసలు ఎందుకు అలా ఆలోచించానో తెలియదు.
ఒక తప్పుకు.. సంవత్సరాల కొద్దీ శిక్ష పడింది నీకు.. సారీ అంటాడు కార్తీక్. అలా అనకండి డాక్టర్ బాబు. ఒకవైపు కన్నీళ్లు.. మరోవైపు ఆనందం అంటుంది దీప. ఇక్కడికి రాగానే నన్ను నేను మరిచిపోతున్నాను అంటుంది దీప. నాకు కూడా అలాగే అనిపిస్తోంది దీప అంటాడు కార్తీక్.
నిన్ను అనుమానించి 11 ఏళ్లు నీకు దూరం అయ్యాను. వీలైతే నన్ను క్షమించు దీప అంటాడు కార్తీక్. దీంతో అందులో పూర్తిగా మీ తప్పు ఏం లేదు కదా. ఆ మోనిత మిమ్మల్ని తప్పు పట్టించింది అంటుంది దీప. మన జీవితంలో మోనిత అనే ఒక విష వృక్షం మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది అంటాడు కార్తీక్.
మోనిత చేయాల్సిన పనులు చేసింది. ఇప్పుడు మోనితను మరిచిపోదాం. మనిద్దరి మధ్య ఇంత చేసిన మోనితను అంటూ దీప ఏదో అనబోతుంది.. ఇంతలో హిమ ఆ మాటలు విని.. ఏం చేసిందమ్మా మోనిత ఆంటి.. అని అడుగుతుంది హిమ.
దీంతో దీప షాక్ అవుతుంది. మోనిత ఆంటి మంచిదే కదా.. ఏం చేసింది అని అడుగుతుంది హిమ. అందరూ మంచివాళ్లే.. టైమ్ అలా మనల్ని బ్యాడ్ చేస్తుంది అంతే అంటుంది దీప. ఇక్కడికొచ్చింది ఎంజాయ్ చేయడానికి.. ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అంటాడు కార్తీక్.
పూజారి మాటల్లో నాకేదో అపశకునం ఉందనిపిస్తోంది అంటుంది సౌందర్య. అవును.. నాకు కూడా అదే అనిపిస్తోంది అంటాడు ఆనందరావు. వాళ్లకు ఏం కాదు మమ్మీ.. నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు ఆదిత్య. నేను వదిలేయలేకపోతున్నాను… అంటుంది సౌందర్య.
మరోవైపు ఓ హోటల్ కు వెళ్తారు కార్తీక్ ఫ్యామిలీ. పిల్లలైతే తెగ ఎంజాయ్ చేస్తారు. హోటల్ లోపలికి వెళ్తారు. అక్కడ మల్లీ అన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది దీప. పిల్లలను పిలుస్తాడు కార్తీక్. నాన్నా ఈరూమా మనది అంటారు పిల్లలు. దీంతో ఈ ఫ్లోర్ అంతా మనదే అంటాడు కార్తీక్. అయితే.. ఈ రూమ్ లో మేము ఉంటాం అంటారు పిల్లలు.
ఇంతలో దీప వెనుక నుంచి వచ్చి కళ్లు మూస్తుంది. ఎవరు.. ఎవరు అంటూ కార్తీక్ ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.