Home » Entertainment » Intinti Gruhalakshmi 9 April 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 9 April Today Episode : తులసి ఆఫర్ కు ఓకే చెప్పిన భాగ్య.. ఇల్లు శశికళ వశం.. ఇల్లు ఖాళీ చేసిన తులసి.. ఇంతలో భారీ షాక్

Authored By
Varun G
The Telugu News | Published on: April 9, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 9 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 602 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శశికళ వచ్చి తులసిని ప్రశ్నిస్తుంది. ఏమైంది ఏం నిర్ణయం తీసుకున్నావు అని. తులసి నా సహనాన్ని పరీక్షించకు.. ఏం నిర్ణయం తీసుకున్నావు అంటుంది శశికళ. దీంతో సమాధానం చెప్పు భాగ్య అంటుంది. కానీ.. భాగ్య ఏం మాట్లాడదు. నేను అప్పు ఇఛ్చింది నీకు.. నువ్వు నా అప్పు తీర్చాలి అని తులసితో అంటుంది శశికళ. చూశావు కదా భాగ్య. నేను నష్టపోతే నీకు రూపాయి రాదు. ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో చెప్పు భాగ్య. టైమ్ లేదు.. అని అడుగుతుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 9 april 2022 full episode

ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. కోర్టుకు వెళ్లాలన్నా వెళ్లు.. అడ్డుపడను. ఏదో ఒకటి పైకి చెప్పు. ఎందుకంటే నా నిర్ణయం నేను తీసుకోవాల్సి ఉంటుంది అంటుంది తులసి. దీంతో నా వాళ్లను పిలిపించాలా అని అంటుంది శశికళ. నువ్వు కోర్టుకు వెళ్తావా లేక మమ్మల్ని ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లమంటావా అంటుంది తులసి. ఇంతలో భాగ్యకు లాస్య ఫోన్ చేస్తుంది. కానీ ఆ ఫోన్ ను కట్ చేస్తుంది. తులసి అక్క నేను కోర్టుకు వెళ్లాలనుకోవడం లేదు అంటుంది భాగ్య. నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను. నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడి ఉండు అంటుంది. చావు పుట్టుకలు మన చేతుల్లో ఎలా ఉండవో జీవితంలో జరిగేది ఏదీ మన చేతుల్లో ఉండదు. ఎవ్వరికీ ఇష్టం లేని నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది క్షమించండి అంటుంది తులసి.

Advertisement

శశికళ గారు ఇక నుంచి ఈ ఇల్లు మీది అంటుంది తులసి. మొత్తానికి మాట నిలబెట్టుకున్నావు తులసి అంటుంది శశికళ. నేను నా మాట నిలబెట్టుకుంటాను.. అని చెప్పి 20 లక్షల డబ్బు తెచ్చి తులసికి ఇస్తుంది. దీంతో ఆ డబ్బును వెంటనే భాగ్యకు ఇచ్చేస్తుంది తులసి.

దీంతో డబ్బు ఉన్న బ్యాగు తీసుకొని భాగ్య చాలా సంతోషిస్తుంది. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతుంది. చూడు అమ్మి.. ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయాలంటే ఎవ్వరికైనా కష్టమే. మీరు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అంటుంది శశికళ. కానీ.. తులసి మాత్రం ఈ ఇంటితో మాకు ఇక రుణం తీరిపోయింది అంటుంది తులసి.

Advertisement

ఈ ఇంట్లో మేము పరాయి వాళ్లమే. రేపే ఖాళీ చేస్తాం అంటుంది తులసి. మరోవైపు డబ్బు తీసుకొని సంతోషంగా ఆటోలో వెళ్తూ ఉంటుంది భాగ్య. తులసి అక్క ఎంత మంచిది అని అనుకుంటుంది భాగ్య. మరోవైపు లాస్య భాగ్యకు ఫోన్ చేస్తూనే ఉంటుంది.

Intinti Gruhalakshmi 9 April Today Episode : తన మాట వినలేదని కోపం తెచ్చుకున్న లాస్య

తీయటి పాయసంలో ఈగ పడినట్టు ఇలాంటి హ్యాపీ టైమ్ లో లాస్య కాల్ చేసింది అని అనుకుంటుంది భాగ్య. ఎత్తి మాట్లాడుతుంది. హాయ్ లాస్య అంటుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది లాస్య. దీంతో పని అయిపోయింది. నేను ఇంటికి వెళ్తున్నాను అంటుంది భాగ్య.

దీంతో లాస్యకు కోపం వస్తుంది. నేను చెప్పింది ఏంటి నువ్వు చేసేది ఏంటి అని ప్రశ్నిస్తుంది. తులసి అక్క వాళ్లు రేపే ఇల్లు ఖాళీ చేస్తున్నారు. శశికళతో డీల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఉంటా మరి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది భాగ్య.

దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చెక్కుతుంది. అప్పుడే నందు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఎవరి మీద కోపం అంటే.. ఈ లోకం మీద అంటుంది. నా మాట ఎవ్వరూ వినడం లేదు అంటుంది. అసలు విషయం చెబుతుంది. తులసి ఇచ్చిన 20 లక్షలకు భాగ్య అమ్ముడు పోయిందని చెబుతుంది.

Advertisement

శశికళ అప్పు తీర్చడానికి బ్యాంకు లోన్ తీసుకుంటా అని చెప్పింది కదా.. ఇప్పుడు ఇల్లు అమ్మేయడం ఏంటి అంటాడు నందు. ఇల్లు అమ్మేసి వాళ్లు ఎక్కడికి వెళ్తారు అంటాడు నందు. ఇంతలో తులసి తమ్ముడు ఇంటికి వస్తాడు. నాతో రా అక్క అంటాడు.

కానీ.. నా అత్తామామల ప్రేమ నాకు ఉంది అంటుంది. దీంతో దీపక్.. కన్న కొడుకే వీళ్లను వదిలేసి పోయాడు. నువ్వెందుకు ఈ ముళ్లకంపను తగిలించుకుంటున్నావు అంటాడు. దీంతో నోర్మూయ్ అంటుంది తులసి. కన్నకొడుకు వాళ్లను వదిలేయలేదు.. వాళ్లే వద్దనుకున్నారు అంటుంది.

నేను ఇంటికి రాను అని ఖరాఖండిగా దీపక్ కు చెప్పేస్తుంది. తర్వాత ఇంటిని ఖాళీ చేస్తుంది తులసి. అందరూ బ్యాగులు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి