Nabha Natesh: అదుగో, నన్ను దోచుకుందువటే సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బెంగుళూరు భామ నభా నటేశ్..ఆ తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూర్ జగన్నాథ్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మాస్ పర్ఫార్మెస్‌తో అన్నీ వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. దాంతో టాలీవుడ్‌లో నభా పేరు మోగిపోయింది. వరుస బెట్టి అవకాశాలు అందుకుంది. మాస్ మహారాజ రవితేజతో డిస్కోరాజా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్, సాయి ధరం తేజ్‌తో సోలో బ్రతుకే సో బెటర్, నితిన్ సరసన మాస్ట్రో సినిమాలలో నటించే ఛాన్సెస్ దక్కించుకుంది.
అయితే, వీటిలో సాయి ధరమ్ తేజ్‌తో నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్ని ఫ్లాప్‌గా మిగిలాయి. దాంతో నభాకు ఉన్నట్టుండి అవకాశాలు లేకుండా పోయాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఉన్న మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కంటే నభాకే అన్నీ రకాలుగా మంచి మార్కులు పడ్డాయి. నటనలోనూ, గ్లామరస్ పర్ఫార్మెన్స్‌లో ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది కూడా నభానే. అందుకే నిధీ కంటే కూడా వరుస అవకాశాలు నభా దక్కించుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.అందరూ అనుకున్నంత రేంజ్‌లో నిధీ అగర్వాల్‌కు అవకాశాలు లేకపోయినా కూడా నభాతో పోల్చుకుంటే ఆమె చాలా రెట్లు బెటర్ అంటున్నారు.
తమిళంలో రెండు హిట్స్ అందుకున్న నిధి ఇప్పుడు మరో రెండు సినిమాలు చేస్తుందట. ఇక తెలుగు లో గల్లా అశోక్ సరసన నటించిన సినిమా ఇప్పటికే రిలీజైంది. మరీ ముఖ్యంగా నిధి ఇప్పుడు ఓ పాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమానే హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇది గనక హిట్ అయితే ఇక నిధిని ఎవరూ పట్టుకోలేరు. కానీ, నభా పరిస్థితే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదట. చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. అందుకే అమ్మడు ఫొటో షూట్స్‌కే పరిమితమైంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.