Intinti Gruhalakshmi 9 June Today Episode : తులసిపై పగ పెంచుకున్న అభి.. నందు, లాస్య, అభి కలిసి తులసిని ఏం చేస్తారు? ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Intinti Gruhalakshmi 9 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 654 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత ఎలా రియాక్ట్ అవుతుందో.. ఎందుకైనా మంచిది అంకుల్ రాకముందే అంకితకు ఈ విషయం చెప్పేద్దాం అని గాయత్రితో అంటాడు అభి. ఏం అవసరం లేదు. అది నిన్ను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అటువంటప్పుడు ఆస్తి నీ పేరు మీద రాస్తే సంతోషిస్తుంది కానీ.. ఎందుకు బాధపడుతుంది.. అంటుంది గాయత్రి. ఇంతలో అక్కడికి అంకిత వచ్చి డాడీ ఎక్కడ అని అడుగుతుంది. పని మీద వెళ్లారు వస్తారులే అని అంటుంది గాయత్రి. అయినా ఇప్పుడు నీకు డాడీతో ఏం పని అని అడుగుతుంది. దీంతో చెస్ ఆడుకుందామని. ఓకే.. నేను ఫోన్ చేస్తా అని చెప్పి ఆగి గుర్తొచ్చింది.. ఆస్తి విషయం మీద వెళ్తా అన్నారు కదా అని అంటుంది. నన్ను కూడా తీసుకెళ్తా అన్నారు.. తీసుకెళ్లకుండా వెళ్లారు ఏంటి అని అంటుంది అంకిత.

intinti gruhalakshmi 9 june 2022 full episode

ఇంతలో శరత్.. డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకొని వస్తాడు. ఏవీ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి అంటుంది అంకిత. దీంతో అంకిత లాక్కుంటుంది. దీంతో అభికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కోర్టు ఆర్డర్ దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించాం. మరి ఈ డాక్యుమెంట్స్ కూడా పూజ చేయించాలి కదా డాడ్ అంటుంది అంకిత. వాటిని ఓపెన్ చేసి లోపల చదువుతుంది. మామ్.. ఇప్పుడు నీకు సంతోషమే కదా అంటుంది అంకిత. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలను గాయత్రి లాక్కొని చదువుతుంది. అందులో ఉన్న పేరు చూసి షాక్ అవుతుంది. నేను చెప్పిందేంటి.. మీరు చేసిందేంటి. మీకు అర్థం కాలేదా.. అర్థం అయ్యే నాటకం ఆడారా? ఆస్తిని అల్లుడి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేయమంటే.. మళ్లీ అంకిత పేరు మీదకే ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారు అని అడుగుతుంది గాయత్రి.

కథ ఇలా అడ్డం తిరిగిందేంటి అని అనుకుంటాడు అభి. అలా రాయిలా నిలబడటం కాదు.. ఏం జరిగింది చెప్పండి అని అడుగుతుంది గాయత్రి. అంకిత ఏదో అన్నదని అభి పేరు మీద చేద్దాం అన్నావు. నీకు సలహా ఇచ్చినట్టే.. అభి పేరు మీద వద్దు అంటూ నాకూ ఒకరు సలహా ఇచ్చారు అంటాడు శరత్.

ఎవరు నీకు సలహా ఇచ్చింది.. ఆ తులసేనా అని అడుగుతుంది గాయత్రి. దీంతో అవును తులసే అంటాడు శరత్. దీంతో అభి షాక్ అవుతాడు. తులసి మిమ్మల్ని ఎందుకు కలిసింది. అసలు తను ఏం చెప్పింది అంటుంది గాయత్రి. దీంతో తులసి ఫోన్ చేస్తే నేను కలవడానికి వెళ్లాను అంటాడు.

ముఖ్యమైన విషయం ఏదో మాట్లాడాలని పిలిచి.. అలా మౌనంగా ఉన్నావేంటమ్మా అంటాడు శరత్. సమస్యను మీదాకా తీసుకురాకుండా నాస్థాయిలోనే పరిష్కరించుకుందాం అనుకున్నా కానీ.. నా వల్ల కాలేదు అంటుంది తులసి. మరో దారిలేక మీ ముందు ఇలా నిలబడ్డాను అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 9 June Today Episode : ఆస్తి అభి పేరు మీద రాయొద్దని శరత్ కు చెప్పిన తులసి

ఇప్పుడు సమస్య నా గురించి కాదు.. నా బిడ్డ నీ అల్లుడు అభి గురించి అంటుంది. దీంతో అతడు చాలా సంతోషంగా ఉన్నాడు.. అతడితో ఏంటి సమస్య అంటాడు శరత్. కాలం మనది కానప్పుడు దురదృష్టం తలుపు పగులగొట్టుకొని వస్తుంది అని అడుగుతుంది తులసి.

నా బిడ్డ అందనంత ఎత్తుకు ఎదగడం తల్లిగా నాకు సంతోషమే కానీ.. ఆ సంతోషం వెనుక ప్రమాదం పొంచి ఉంది. అభి చుట్టూ ఏదో జరుగుతోంది. ప్రమాదం మాయలా కమ్మేసింది. ఇన్నాళ్లు వాడికి దూరంగా ఉన్నవాళ్లు డబ్బు వాసన రాగానే వాడి వెనుక తిరుగుతున్నారు.

నా బిడ్డ వాళ్ల చేతుల్లో ఎక్కడ మోసపోతాడో అని భయమేస్తుంది. వాళ్ల నాన్న నుంచి నేను వాడిని దూరం చేస్తున్నా అని అనుకుంటున్నాడు.. అంటుంది. ఆస్తి విషయంలో ఎవరి వల్ల అయినా ఏ పొరపాటు జరిగినా దాని ఫలితం నా బిడ్డ అనుభవించాల్సి వస్తుంది అంటుంది తులసి.

ఏ తల్లి తన బిడ్డ గురించి కోరుకోనిది నేను కోరుకుంటున్నాను.. దయచేసి ఆస్తి అభి పేరు మీద పెట్టకండి.. అంకిత పేరు మీద పెట్టండి అని చెబుతుంది తులసి. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అన్నయ్య. డబ్బు విషయంలో మన మధ్య గొడవలు రాకూడదు.. అంటుంది తులసి.

ఇది చెబుదామనే ఒక తల్లిగా ఆరాటపడుతూ మిమ్మల్ని పిలిచాను అంటుంది తులసి. ఏంటి అన్నయ్య ఆలోచిస్తున్నారు నా మాట మీద నమ్మకం లేదా అని అంటుంది. సరే అన్నయ్య వదిన మాట కాదనడం మీకు కష్టం అయితే ఆస్తి అభి పేరు మీద పెట్టండి కానీ.. ఆస్తిని లాస్య, నందు నుంచి కాపాడుకునేలా మీరేలా చూసుకోవాలి అంటుంది తులసి.

ఏదో ఒకటి చెప్పండి.. దేనికో ఒక దానికి ఒప్పుకోండి అంటుంది తులసి. దీంతో నన్ను ఆలోచించుకోనివ్వమ్మా అంటాడు శరత్.. అది జరిగింది అని అభి, గాయత్రికి విషయం చెబుతాడు. చాలా థాంక్స్ ఆంటి.. అని మనసులో అనుకుంటుంది అంకిత.

అంటే.. మీ భార్య మాట కన్నా ఆ తులసి మాటే ఎక్కువైందా.. నేను చెప్పింది అంతా గాలివానకు కొట్టుకుపోయిందా. అసలు మన ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవడానికి తులసి ఎవరు అంటుంది. అయినా తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాక ఇంకేముంది అంటుంది గాయత్రి.

దీంతో మామ్.. మేము తులసి ఆంటిని వద్దనుకొని రాలేదు.. తను వెళ్లమంటేనే వచ్చాం అంటుంది అంకిత. కాదంటావా అభి అని ప్రశ్నిస్తుంది అంకిత. అభి అసమర్థుడని తులసి అనలేదు. తల్లీకొడుకుల మధ్య అపార్థాలు క్రియేట్ చేయడానికి ట్రై చేయకు అంటాడు శరత్.

నా కొడుకు పేరు మీద ఆస్తి వద్దు అంటే దాని అర్థం ఏంటి.. మీ అమ్మ చేసింది తప్పు కాదా అభి అని అడుగుతుంది. ఆస్తి వల్ల అభి సమస్యల్లో చిక్కుకుంటాడని భయపడింది తులసి అంటాడు శరత్. అన్నీ తెలసి అభిని కష్టాల్లోకి ఎందుకు నెట్టేయడం అంటాడు శరత్.

తులసి చెప్పింద కాబట్టి భయపడి నిర్ణయాన్ని నేను మార్చుకోలేదు. తను చెప్పిన దాంట్లో నిజం ఉంది కాబట్టే నేను ఇలా చేశాను. అయినా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తులసికి ఏముంది అని అడుగుతాడు శరత్. నా పేరు మీద ఆస్తి ఉంటే తనకు ఒరిగేదేమీ ఉండదు అంటుంది అంకిత.

భార్యాభర్తలు అన్నాక ఏ విషయం అయినా కలిసే నిర్ణయం తీసుకుంటారు అంటాడు శరత్. అంకిత పేరు మీద ఆస్తిని రాయడం నీకు ఇష్టం ఉందా లేదా అని అడుగుతాడు శరత్. దీంతో నాకు ఎందుకు ఇష్టం ఉండదు. అది అంకిత పుట్టింటి ఆస్తి అంటాడు అభి.

మరోవైపు ప్రేమ్… ఒక ఆల్బమ్ చేస్తున్నానని మీరు స్పాన్సర్ చేయాలని ఓ కంపెనీకి వెళ్లి కోరుతాడు. దీంతో అతడు కుదరదు అంటాడు. మా టాలెంట్ డెమో ఒకసారి చూడండి అంటాడు. దీంతో ఇదివరకు మీరు చేసిన ఆల్బమ్ చూపించండి అంటాడు. దీంతో ఇదే మొదటి ఆల్బమ్ అంటాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

13 minutes ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

1 hour ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

2 hours ago

Morning Tiffin | ఉద‌యం టిఫిన్ చేయ‌డం స్కిప్ చేస్తున్నారా.. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది

Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…

3 hours ago

Health Tips | వారు అస్స‌లు బొప్పాయి తిన‌కూడ‌దు.. తింటే మాత్రం…

Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…

4 hours ago

Banana peel Face Pack | అందానికి అరటిపండు తొక్క… సహజ మెరుపు కోసం ఇంట్లోనే బెస్ట్ ఫేస్ ప్యాక్ ఇలా చేయండి!

Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…

5 hours ago

September | ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం మాములుగా లేదు ..సెప్టెంబర్లో పట్టిందల్లా బంగారం!

September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…

6 hours ago

Flipkart Jobs : ఫ్లిప్‌కార్ట్‌ లో 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు..త్వరపడండి

Flipkart Jobs: పండుగ సీజన్‌ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్‌ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ తన బిగ్ బిలియన్ డేస్‌…

15 hours ago