
Allu Arjun unable to put new project line due to Sukumar
Allu Arjun : స్టార్ డైరెక్టర్ సుకుమార్ వల్ల కొత్త ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టలేకపోతున్న ఐకాన్ స్టార్..? అంటూ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. చూస్టుంటే అది నిజమనే నమ్మాల్సి వస్తోంది కూడా. ఎందుకంటే గత ఏడాది చివరిలో సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప పార్ట్ 1 వచ్చింది. ఈ సినిమా ఊహించని విధంగా 350 కోట్లకి పైగానే వసూళ్ళు రాబట్టి ఇటూ అన్నీ సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు అటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది.దాంతో పుష్ప సీక్వెల్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నామని అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే దసరాకి రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ తర్వాత మార్చ్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి పుష్ప 1 వచ్చిన డిసెంబర్ నెలలోనే ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పటివరకు అసలు పుష్ప 2 కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ పాటికే సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ అయి ఫస్ట్ లుక్, టీజర్ వచ్చేయాల్సింది. కానీ, ఇప్పటికీ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ రావడం లేదు.సుకుమార్ పుష్ప సీక్వెల్ కథలో మార్పులు చేర్పులు చేస్తుండటమే దీనికి కారణం అంటున్నారు. మరొకవైపేమో అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మేకోవర్‌తో రెడీగా ఉన్నారు.
Allu Arjun unable to put new project line due to Sukumar
ఇది పూర్తైయ్యాకే కొత్త సినిమాలను లైన్‌లోకి తీసుకురాగలరు. కానీ, సుక్కూ వల్ల పుష్ప 2 ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా లేదనిపిస్తోంది. ఎంతకాదన్న ఇంకో ఏడాది సమయం ఈజీగా పడుతుందని టాక్ వినిపిస్తోంది. దాంతో బన్నీ కొత్త ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఏదేమైనా పుష్ప 2 వల్ల బన్నీ బాగా లాకయ్యారు అని అర్థమవుతోంది. అయితే, సుకుమార్ పుష్ప సీక్వెల్ సినిమా కథ కోసం ఇంతగా సమయం తీసుకోవడానికి కారణం ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2. ఈ సినిమాలు భారీ వసూళ్ళను రాబట్టాయి. ఆ స్థాయిలో పుష్ప సీక్వెల్ ఉండాలంటే ఇంతకముందు సుకుమార్ రెడీ చేసుకున్న కథ, కథనాలు సరిపోవట. ఈ రెండు సినిమాల రేంజ్‌ను దాటడానికే మళ్ళీ పూర్తి స్థాయిలో కొత్త వెర్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.