Intinti Gruhalakshmi 9 March Today Episode : రూమ్ రెంట్ కు తీసుకున్న ప్రేమ్, శృతి.. ప్రేమ్ మీద బెంగపెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకున్న దివ్య.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 9 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 575 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయ బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడు పరందామయ్య వస్తాడు. తులసితో చెప్పి ప్రేమ్ ను వెనక్కి పిలవమని చెప్పొచ్చు కదా అంటుంది అనసూయ. అంతలోనే నందు, లాస్య వస్తారు. అమ్మ.. ఆఫీసుకు వెళ్తున్నాను.. అంటాడు నందు. దీంతో వెళ్లు నాన్నా. లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నావా.. అంటుంది. లేకపోతే చిక్కిపోతావు అంటుంది అనసూయ. దీంతో ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు నందు. ప్రేమ్ ను వెళ్లగొట్టారు.. నీకు మాత్రం ఎలాంటి పట్టింపు లేదా అని అంటుంది అనసూయ.

intinti gruhalakshmi 9 march 2022 full episode

ప్రేమ్ కు నేను తండ్రినంటూ శివాలెత్తిపోయావు కదా. తండ్రి అనేవాడు ఇలాగే ప్రవర్తిస్తాడా. చేతిలో చిల్లిగవ్వ లేకుండా భార్యతో సహా వాడు బయటికెళ్లాడు. వాడిని పట్టించుకోవా నువ్వు అంటుంది అనసూయ. దీంతో వెళ్లింది వాడు.. వెళ్లగొట్టింది వాడి అమ్మ. అదేంటి అని అడిగితేనే నిన్న ఒంటి కాలి మీద లేచింది అని చెబుతాడు నందు. నాన్నా.. మీకు తులసి అంటే ఇష్టం.. అందుకే తనవైపు మాట్లాడుతున్నారు అంటాడు నందు. కన్నకొడుకు అంటే ఇష్టం ఉండని తల్లిదండ్రులు ఉండరురా అంటాడు పరందామయ్య. నువ్వు కేఫ్ లో జాయిన్ అవుతానని అన్నప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసింది తులసినే అనే విషయం మరిచిపోకు అంటాడు పరందామయ్య.

దీంతో తులసి అసలు స్వరూపం ఏంటో త్వరలోనే బయటపడుతుంది అంటాడు నందు. దీంతో పోనీలేండి.. ఇప్పటికైనా నా గురించి తెలుసుకున్నారు అంటుంది తులసి. సమయం వచ్చినప్పుడు కూడా మీ అమ్మానాన్న నీ వెనుక నిలబడటం లేదు అంటుంది లాస్య. దీంతో నువ్వు ఒక్కదానివి ఉన్నావు కదా.. అది చాలులే అంటుంది తులసి.

ఒకసారి వద్దు అనుకున్నాక ఇంకెప్పుడూ కావాలనుకోను అంటుంది తులసి. దీంతో ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మీ గురించి కాదు. ప్రేమ్ గురించి అంటుంది అనసూయ. వాడిని శిక్షిందించి తనే.. అంటాడు ప్రేమ్. కట్టుబట్టలతో ఎందుకు ప్రేమ్ ను తరిమింది అంటుంది లాస్య.

నందు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ప్రేమ్ గురించి నిర్ణయం నీ చేతుల్లో ఉంది తులసి అంటుంది అనసూయ. ప్రేమ్ మనతో పాటు కలిసి ఉండటం నీకు ఇష్టం లేదా అంటుంది అనసూయ. నందు మెత్తపడినప్పుడు నీకెందుకు బాధ అంటుంది అనసూయ. దీంతో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

Intinti Gruhalakshmi 9 March Today Episode : ప్రేమ్, శృతిని తన ఓనర్ దగ్గరికి తీసుకెళ్లిన రాములమ్మ

ఈ విషయాలు విన్న అంకిత.. అభి దగ్గరికి వెళ్లి అభి.. ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు అంటుంది. నాకైతే మనసు మనసులో లేదు. వాళ్లు ఎక్కడున్నారో.. ఎలాంటి కష్టాలు పడుతున్నారో అంటుంది అంకిత. నిజం చెప్పాలంటే మామ్ కు వాడంటేనే ఎక్కువ అటాచ్ మెంట్.. అలాంటిది మామ్ వాడిని ఎందుకు పంపించిందో అర్థం కావడం లేదు అంటాడు అభి.

కట్ చేస్తే.. రాములమ్మ.. ప్రేమ్, శృతి ఇద్దరినీ ఒక చోటుకు తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగితే మా ఓనర్ దగ్గరికి అంటుంది. తన ఇంటి ఓనర్ దగ్గరికి తీసుకెళ్తుంది. రాములమ్మ.. ఈ బాబురావు దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్తచేతులతో రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటాడు బాబురావు.

ఎవరు వీళ్లు అని అడుగుతాడు. పక్క వీధిలో మన ఇల్లు ఖాళీగా ఉంది కదండి.. అని అడుగుతుంది. ఇంతలో బాబురావు భార్య బయటికి వస్తుంది. ఇల్లు అద్దెకు కావాల్సింది వీళ్లకే అక్కడ అంటుంది రాములమ్మ. నాకు బాగా కావాల్సిన వాళ్లు అంటుంది.

చూడబోతే పెద్దింటి పిల్లల్లా ఉన్నారు ఇలాంటి బస్తీకి తీసుకొచ్చావు ఏంటి అంటుంది బాబురావు భార్య. బస్తీ పక్కన ఉన్న ఖాళీ పోర్షన్ ను చూపించు.. అని తన భర్తకు చెబుతుంది. దీంతో ఆ ఇంటి అద్దె 4000.. దానికి అడ్వాన్స్ 4000 ఇవ్వాలి అంటాడు. అదేంటి.. దానికి 3000 కదా.. అంటుంది. లేదంటే అమ్మ గారితో మాట్లాడనా అంటే.. సరే 3000 ఇవ్వమను అంటాడు బాబురావు.

మరోవైపు తులసి.. ప్లేట్ లో దివ్య కోసం అన్నం పెడుతుంది. ఎవరి కోసం ఆంటి అని అడుగుతుంది అంకిత. దీంతో దివ్య కోసం అంటుంది తులసి. మీరు తొందరపడ్డారేమో ఆంటి.. ప్రేమ్ ను ఇంట్లో నుంచి పంపించకుండా ఉండాల్సింది అంటుంది అంకిత.

అందరూ బాధపడుతున్నారు అంటుంది అంకిత. దీంతో నాకంటే ఎక్కువగా బాధపడుతున్నారా అంటుంది తులసి. తప్పు చేసిన వ్యక్తిని శిక్షిస్తే ఇంకా మొండిగా మారుతారు ఆంటి అంటుంది అంకిత. దీంతో ప్రేమ్ కు ఏది మంచో అదే చేశాను.. ఈ విషయంలో ఎవ్వరూ ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు అంటుంది తులసి.

మరోవైపు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది దివ్య. తనకు ఫుడ్ తీసుకొని వెళ్తుంది తులసి. దీంతో దివ్య తన ముఖం కూడా చూడదు. నీకోపం తగ్గాకే అమ్మతో మాట్లాడు కానీ.. కోపంతో కడుపు మాడ్చుకోకు అంటుంది తులసి. దీంతో నేను తినను.. అస్సలు తినను అంటుంది దివ్య.

ప్రేమ్ అన్నయ్య ఇంటికి వచ్చేదాకా నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అంటుంది దివ్య. ఇంతలో తను కళ్లు తిరిగి కింద పడిపోతుంది. బీపీ చెక్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

54 minutes ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

13 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

15 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

19 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

22 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago