Intinti Gruhalakshmi 9 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మీ లేటెస్ట్ ఎపిసోడ్ 09 సెప్టెంబర్ 2021, గురువారం తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ 420 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నాకు ప్రేమ్ పెళ్లి ఎప్పుడు చేయాలి? ఏం చేయాలి? అనే విషయం తెలియదా? నేను అన్నీ తెలిసే చేస్తున్నా తులసి.. అని నందు.. తులసితో అంటాడు.
ఇప్పుడు పెళ్లి వాళ్లను ఎందుకు అర్ధాంతరంగా రమ్మంటున్నారు అని తులసి అనగానే.. చూడు తులసి.. ఇప్పుడు నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడు ఏం మాట్లాడకు. పెళ్లి వాళ్లకు ముందు ఏ లోటు రాకుండా చూడు.. అని చెబుతాడు నందు. వాళ్ల నాన్న కూడా వచ్చి.. తులసి చెప్పేది కాస్త వినొచ్చు కదా.. అని అంటాడు. నేను ఏం చేసినా.. అందరి మంచి కోసమే అని చెబుతాడు నందు.
ప్రేమ్ నువ్వు కూడా రెడీ అవ్వు. పెళ్లి వాళ్లు వస్తున్నారు.. ముందు వెళ్లి రెడీ అవ్వండి.. అని చెబుతారు నందు. నాన్న ఏంటి ఇదంతా నాకు ఇంకా టైమ్ కావాలని చెబుతున్నాను కదా.. అని అంటాడు. ముందు నువ్వు రెడీగా.. తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం.. అని అంటాడు నందు.
వీడేంటి.. ప్రేమ్ కు టైమ్ ఇస్తాను.. మాట్లాడుకునే అవకాశం ఇస్తాను.. అని చెప్పి… పెళ్లి వాళ్లను రమ్మనడం ఏంటి.. అని నందు తండ్రి.. తులసితో చెబుతాడు. అందరూ షాక్ లో ఉంటారు. అసలు.. ఏం జరుగుతుందోనని తులసి భయపడుతుంది. నందుకు ఒక్క తన తల్లి మాత్రమే సపోర్ట్ ఇస్తుంది.
రాములమ్మ.. వచ్చే పెళ్లి వాళ్ల కోసం అర్జెంట్ గా టిఫిన్స్ రెడీ చేయాలి. కావాల్సిన కూరగాయలు కట్ చేయి.. వండుదాం అని రాములమ్మకు చెబుతుంది. అమ్మా.. ఇదంతా మీకు నచ్చే చేస్తున్నారా? అంటే తప్పదు రాములమ్మా.. పరిస్థితులకు తగ్గట్టు మనమే నడుచుకుంటూ వెళ్లిపోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో అని చెబుతుంది. ఇంతలోనే ప్రేమ్ వచ్చి.. ఏంటి అమ్మా.. ఇదంతా.. నాకు టైమ్ కావాలని క్లియర్ గా చెప్పాను కదా.. నాకు చిరాకుగా ఉంది. నాకు ఇష్టం ఉన్నట్టు ఉండే స్వేచ్ఛ కూడా నాకు లేదా? అని అనగానే వాళ్లు చూడటానికే వస్తున్నారు కదా.. పెళ్లి కాదు కదా.. అని చెబుతుంది తులసి.
చూడు ప్రేమ్.. ఇది చిన్నవిషయమే. దీనికి కంగారు పడటం కాదు. నువ్వు కాస్త నిదానంగా ఉండు. నువ్వు ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. అనేదానిపైనే ఏకాగ్రత చూపించు. ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం లభిస్తుంది. అనగానే.. ఏమోనమ్మా.. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి.. వేరేవాళ్ల ముందు ఏంటి ఇదంతా? అనగానే.. ఏం చేస్తాం.. మీ నాన్న అర్థం చేసుకోలేదు కదా. కనీసం వచ్చేవాళ్లకు అయినా నీ బాధ ఏంటో.. వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పు.. అప్పుడు ఇంట్లో వాళ్లకు కూడా తెలిసిపోతుంది.. అని చెబుతుంది తులసి.
కట్ చేస్తే.. అభి తెగ ఆలోచిస్తుంటాడు. ఏంటి అభి.. ఇంతగా ఆలోచిస్తున్నావు.. అనగానే ప్రేమ్ కు సమయం కావాలని చెప్పాక కూడా ఎందుకు నాన్న పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అని అంటాడు. ప్రేమ్ కు ఏం కావాలో… మామయ్య గారికి బాగా తెలుసు.. అని అంటుంది తన భార్య.
నందు ఎందుకు ఇంతలా బిహేవ్ చేస్తున్నాడు. ప్రేమ్ కు సమయం కావాలన్నా కూడా ఇలా ఎందుకు చేస్తున్నాడు. ప్రేమ్ చెప్పే మాట వినాలి కదా.. అని తులసితో తన మామయ్య అంటాడు. ఏం కాదు లేండి.. ప్రేమ్ గురించి నాకు తెలుసు. పెళ్లి వాళ్లు వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం అంటాడు.
కట్ చేస్తే.. శృతి విచారంగా ఆలోచిస్తుంటుంది. రాములమ్మ వచ్చి.. ఏంటి శృతి అమ్మా.. అంతగా బాధపడుతున్నావు.. మనసులో పెట్టుకుంటే ఏంటి లాభం అమ్మా.. ప్రేమ్ బాబుకు నీ మనసులో మాటను చెప్పు.. అనగానే రాములమ్మా… ఏదేదో ఊహించుకోకు.. వెళ్లి ఇవన్నీ లోపల పెట్టు.. అని చెబుతుంది శృతి.
ఇంతలోనే లాస్య వచ్చి.. నందు నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అంటుంది. ఈ పెళ్లి చూపులు శృతికి అని తెలిస్తే ఏం తను ఒప్పుకుంటుందా? ప్రేమ్ ఒప్పుకుంటాడా? అంటుంది లాస్య. నీకెందుకు అవన్నీ నేను చూసుకుంటా.. అంటాడు నందు. ఇంతలోనే పెళ్లి వాళ్లు వస్తారు.
అందరినీ పిలుస్తాడు నందు.. అందరినీ పరిచయం చేస్తాడు. వెంటనే అవును.. నందు గారు అందరూ వచ్చారు.. అమ్మాయి ఏది.. అని అడుగుతాడు పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తి. అమ్మాయిని మీరే కదా తీసుకురావాలి.. అని అంటాడు నందు నాన్న. అమ్మాయిని మేము తీసుకురావడం ఏంటి.. ఈ పెళ్లి చూపులకు వచ్చింది మా అబ్బాయి అశోక్ కోసం.. అని చెబుతారు. అందరూ షాక్ అవుతారు. తులసి కూడా అసలు ఏం జరుగుతోంది అని నందును అడుగుతుంది. దీంతో ఈ పెళ్లి చూపులు శృతికి అని చెబుతాడు నందు. దీంతో వెంటనే ప్రేమ్ అక్కడికి వచ్చి లేవండి.. అని అంటాడు. దీంతో నందు లేచి.. ఏంట్రా ప్రేమ్ నువ్వు చేసేది అంటాడు.
ఇప్పుడు పిలిస్తే తప్పేముంది.. ముక్కూ ముఖం తెలియని అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటే.. నందు పెళ్లి చేయాలనుకోవడం తప్పా? అని లాస్య అనగానే.. ముమ్మూటికీ తప్పే.. శృతికి చెప్పకుండా శృతికి పెళ్లి చూపులు అరేంజ్ చేయడం ఏంటి? తనకు ఇంత త్వరగా పెళ్లి చూపులు అరేంజ్ చేయడం ఎందుకు? తను అడిగిందా? అని ప్రేమ్ ప్రశ్నిస్తాడు. శృతి ఎవరు.. అని రేపు నా కోడలు అడిగితే ఏం చెప్పాలి.. ఈమె నా కొడుకు మాజీ ప్రేమికురాలు.. భర్తకు విడాకులు ఇస్తే.. కొడుకు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు అని చెప్పాలా? అని అంటాడు నందు.
శృతి నా మనిషి. తనను ఒక్క మాట కూడా అనకూడదు. లాస్య.. ఏదో అంటే కూడా లాస్యను కూడా శృతి విషయంలో ఏం చెప్పొద్దు మీరు అని అంటాడు ప్రేమ్. శృతి గురించి ఎవ్వరూ ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు.. అని చెబుతాడు ప్రేమ్. సరే.. శృతి గురించి ఆలోచించకూడదు అంటే.. శృతి గురించి పట్టించుకోవట్లేదు.. అని అనాలంటే… ప్రేమ్ నేను చెప్పిన సంబంధం విషయం గురించి వెంటనే ఆలోచించు.. అని చెప్పి వెళ్లిపోతాడు నందు.
ప్రేమ్ మన కొడుకు.. వాడి మనసు తెలుసుకొని ప్రవర్తించాలి.. అని తులసి.. నందుతో అంటుంది. నాకు తెలియదా? వాడి పెళ్లి గురించి ఆలోచించాల్సింది నేనే. వాడికి మంచేదో.. చెడేదో నాకు తెలుసు. వాడి ఫ్యూచర్ బాగుండాలనే నేను అనుకుంటున్నాను.. అంటే మరి ఒకప్పుడు మీరు కూడా ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నారు కదా.. అని అంటే.. నేను చేసిన తప్పే నాకు కొడుకు చేయకూడదు అని అనుకుంటున్నా.. అని అంటాడు నందు. అంటే.. మీరు నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశారా? అంటుంది తులసి. నువ్వు ఏమైనా అనుకో.. ప్రేమ్ , శృతి ని ఒక్కటి కానివ్వను..అంటాడు నందు.
అయితే.. మీరు ఆ మాట మీద ఉంటే.. నేను కూడా ఒక విషయం చెబుతాను వినండి.. అంటుంది తులసి. ఏంటి.. నాతోనే చాలెంజ్ చేస్తున్నావా? అంటాడు నందు. ఇద్దరూ డబ్బు గురించి చర్చించుకుంటారు. డబ్బే ఈ లోకాన్ని శాసిస్తోంది అని నందు అంటే.. డబ్బు మాత్రమే కాదు.. బంధాలు, ఆప్యాయతలు కూడా ముఖ్యమే అంటుంది తులసి.
కట్ చేస్తే.. నందు.. శృతిని కలుస్తాడు. నేను ఇక నుంచి మీ ఇంట్లో నుంచి వెళ్లిపోదామని అనుకుంటున్నా.. అంటుంది శృతి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ప్రేమ్ కు అర్థమయ్యేలా ఇవన్నీ చెప్పాలి.. అంటాడు నందు. ప్రేమ్ జీకే కూతురును పెళ్లి చేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే.. నువ్వు నీ ప్రేమను మాత్రం త్యాగం చేయాలి.. అని చెబుతాడు నందు. దీంతో గుక్క పెట్టి ఏడుస్తుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
This website uses cookies.