kasthuri shankar : సినీ, రాజకీయ , సామాజిక అంశాలపైన కస్తూరీ శంకర్ ఎప్పటి కప్పుడు స్పందిస్తుంటారు. ఇటీవల కాలంలో హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ పైన కస్తూరీ శంకర్ స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. కాగా, తాజాగా కస్తూరీ శంకర్ కర్నాటకలో జరిగిన ఓ ఘటనపైన కూడా స్పందించింది. అలా ఈమె మళ్లీ వివాదంలోకి వెళ్లిపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..కర్నాటక స్టేట్ లోని ఓ స్కూల్ లో బుర్ఖాలు ధరించిన కారణంగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వారిని స్కూల్ కు అనుమతించ లేదు. దాంతో స్టూడెంట్స్ తమను అనుమతించాలని రిక్వెస్ట్ చేశారు. అయినా ప్రిన్సిపాల్ ఒప్పుకోలేదు. కాగా, తమకు ముందే ఇటువంటి కండీషన్స్ ఉంటాయని చెప్తే తాము ఇక్కడ ఈ స్కూల్ లో జాయిన్ అయ్యే వాళ్లమే కాదని ఈ సందర్భంగా విద్యార్థినులు తెలిపారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగా, అది బాగా వైరలయింది కూడా. ఈ క్రమంలోనే కస్తూరీ శంకర్ ఈ వీడియో చూసి స్పందించింది.వీడియోపై కస్తూరీ శంకర్ తన అభిప్రాయాన్ని తెలిపింది. యూనిఫాంలకు అంతరాయం కలిగించే ఎటువంటి మతపరమైన దుస్తులను కూడా వేసుకోవద్దంటూ అక్కడి ప్రభుత్వం జీవో చేసిందని తాను నమ్ముతున్నానని, అయితే, అది రాత్రికి రాత్రే వచ్చిన జీవో అవుతుందని పేర్కొంది. ఆ జీవో అమలులోకి రావడానికి సమయం ఇవ్వలేదని, ఇప్పుడు ఇది కోర్టులోనూ నిలబడదని తెలిపింది. తమ సమస్యను లీగర్‌గా పరిష్కరించుకునేందుకుగాను పిల్లలకు అంత సమయం లేదని కస్తూరీ చెప్పుకొచ్చింది.
కాగా, కస్తూరీ శంకర్ స్పందనపైన నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కస్తూరీ శంకర్ బ్యూటి విత్ బ్రెయిన్ కాదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.ఈ క్రమంలోనే మరో నెటిజన్ రోడ్లపైన నమాజ్ చేస్తున్నపుడు అది సెక్యూలర్ ఎలా అవుతుందని ప్రశ్నించాడు. దానికి కస్తూరీ శంకర్ రిప్లయి ఇచ్చింది. రోడ్డు మీద హిందువులు, క్రిస్టియన్ల ఊరేగింపులు జరిగినపుడు రోడ్లన్నీ బ్లాక్ అవుతుంటాయని, రాజకీయ సభలు, ర్యాలీలు కూడా జరుగుతాయని, అటువంటపుడు ముస్లింలు పూజించుకుంటే తప్పేంటని అడిగింది కస్తూరీ శంకర్. నువ్వు ఎటువంటి నమాజ్‌ల గురించి చెప్పాలని అనుకుంటున్నావ్.. అని నెటిజన్ ను రివర్స్ ప్రశ్నించింది కస్తూరీ శంకర్.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.