Intinti Gruhalakshmi Kasthuri : రోడ్లపై ముస్లింలు నమాజు చేస్తే తప్పేంటి.. మళ్లీ వివాదంలోకి కస్తూరీ శంకర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi Kasthuri : రోడ్లపై ముస్లింలు నమాజు చేస్తే తప్పేంటి.. మళ్లీ వివాదంలోకి కస్తూరీ శంకర్..!

 Authored By mallesh | The Telugu News | Updated on :4 February 2022,9:40 pm

kasthuri shankar : సినీ, రాజకీయ , సామాజిక అంశాలపైన కస్తూరీ శంకర్ ఎప్పటి కప్పుడు స్పందిస్తుంటారు. ఇటీవల కాలంలో హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ పైన కస్తూరీ శంకర్ స్పందించిన తీరు అందరికీ తెలిసిందే. కాగా, తాజాగా కస్తూరీ శంకర్ కర్నాటకలో జరిగిన ఓ ఘటనపైన కూడా స్పందించింది. అలా ఈమె మళ్లీ వివాదంలోకి వెళ్లిపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..కర్నాటక స్టేట్ లోని ఓ స్కూల్ లో బుర్ఖాలు ధరించిన కారణంగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వారిని స్కూల్ కు అనుమతించ లేదు. దాంతో స్టూడెంట్స్ తమను అనుమతించాలని రిక్వెస్ట్ చేశారు. అయినా ప్రిన్సిపాల్ ఒప్పుకోలేదు. కాగా, తమకు ముందే ఇటువంటి కండీషన్స్ ఉంటాయని చెప్తే తాము ఇక్కడ ఈ స్కూల్ లో జాయిన్ అయ్యే వాళ్లమే కాదని ఈ సందర్భంగా విద్యార్థినులు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగా, అది బాగా వైరలయింది కూడా. ఈ క్రమంలోనే కస్తూరీ శంకర్ ఈ వీడియో చూసి స్పందించింది.వీడియోపై కస్తూరీ శంకర్ తన అభిప్రాయాన్ని తెలిపింది. యూనిఫాంలకు అంతరాయం కలిగించే ఎటువంటి మతపరమైన దుస్తులను కూడా వేసుకోవద్దంటూ అక్కడి ప్రభుత్వం జీవో చేసిందని తాను నమ్ముతున్నానని, అయితే, అది రాత్రికి రాత్రే వచ్చిన జీవో అవుతుందని పేర్కొంది. ఆ జీవో అమలులోకి రావడానికి సమయం ఇవ్వలేదని, ఇప్పుడు ఇది కోర్టులోనూ నిలబడదని తెలిపింది. తమ సమస్యను లీగర్‌గా పరిష్కరించుకునేందుకుగాను పిల్లలకు అంత సమయం లేదని కస్తూరీ చెప్పుకొచ్చింది.

Intinti Gruhalakshmi Kasthuri reaction on karnataka incident

Intinti Gruhalakshmi Kasthuri reaction on karnataka incident

kasthuri shankar : నెటిజన్ ప్రశ్నకు వెంటనే కౌంటర్..

కాగా, కస్తూరీ శంకర్ స్పందనపైన నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కస్తూరీ శంకర్ బ్యూటి విత్ బ్రెయిన్ కాదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.ఈ క్రమంలోనే మరో నెటిజన్ రోడ్లపైన నమాజ్ చేస్తున్నపుడు అది సెక్యూలర్ ఎలా అవుతుందని ప్రశ్నించాడు. దానికి కస్తూరీ శంకర్ రిప్లయి ఇచ్చింది. రోడ్డు మీద హిందువులు, క్రిస్టియన్ల ఊరేగింపులు జరిగినపుడు రోడ్లన్నీ బ్లాక్ అవుతుంటాయని, రాజకీయ సభలు, ర్యాలీలు కూడా జరుగుతాయని, అటువంటపుడు ముస్లింలు పూజించుకుంటే తప్పేంటని అడిగింది కస్తూరీ శంకర్. నువ్వు ఎటువంటి నమాజ్‌ల గురించి చెప్పాలని అనుకుంటున్నావ్.. అని నెటిజన్ ను రివర్స్ ప్రశ్నించింది కస్తూరీ శంకర్.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది