Intinti Gruhalakshmi Kasturi : నీకు ముందే చెప్పాగా, అలాంటివి షేర్ చేయోద్దని.. కుష్బూకి సలహా ఇచ్చిన కస్తూరి
Intinti Gruhalakshmi Kasturi : సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియలో ట్రోలింగ్స్ ఎదురు కావడం చాలా సహజం. కొందరు వీటిని ధీటుగా ఎదుర్కొంటుండగా, మరి కొందరు మాత్రం మౌనం వహిస్తుంటారు. బీజేపీ నాయకురాలు కుష్బూ, నటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వారు తమపై వచ్చే విమర్శలకు తమధైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా కుష్బూ లండన్‌కు వెళ్లింది. హలో లండన్ అని అక్కడ దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. దీనిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు లావణ్య కేసు కంటే లండన్ వెళ్లడం ముఖ్యమైందా? అని కౌంటర్ వేశాడు. దీనిపై కుష్బూ తగ్గేదే లే అంటూ ధీటుగా బదులు ఇచ్చింది.
కాంగీలు ఎప్పుడూ కూడా ఎదుటి వారి బాధను అర్థం చేసుకోలేరు.. కరోనా నుంచి కోలుకుంటున్న నా పాపకు తన తల్లి అవసరం ఉంది..సరే అదంతా కాదు గానీ.. రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ ఎక్కడున్నారు.. వారికి ఎన్నికలే ముఖ్యం కదా? అని రివర్స్ కౌంటర్ వేశారు. కుష్బూ చేసిన ట్వీట్‌పై కస్తూరీ కూడా స్పందించింది. బేబ్.. ఇది వరకే నీకు చెప్పాను.. మళ్లీ చెబుతున్నాను.. ట్విట్టర్‌లో ఇలా పర్సనల్ విషయాలను షేర్ చేయకు.. ఇక్కడంతా విషపూరితమైన వాళ్లే ఉన్నారు..ఇలాంటి వాటికి ఇన్ స్టా, ఎఫ్‌బీలు కాస్త బెటర్.. అని కస్తూరీ శంకర్ సలహా ఇచ్చారు.

Intinti Gruhalakshmi Kasturi suggestion to kushbu sundar
Intinti Gruhalakshmi Kasturi : కస్తూరీ మాటకు మాట..
లావణ్య ఘటనతో కుష్బూ, కస్తూరీలపై నెగెటివ్ ట్రోలింగ్ బాగానే జరుగుతుంది. క్రైస్తవ మిషనరీలో చదివే లావణ్య అనే అమ్మాయి.. అక్కడి వేధింపులను భరించలేక ప్రాణాలు తీసుకుంది. బలవంతంగా మతాన్ని మార్పించాలని చూస్తున్నారంటూ వాపోయింది. చివరకు ఉరి వేసుకుని తన ప్రాణాలను తీసుకుంది లావణ్య. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. కుష్బూతో పాటు పలువురు ప్రముఖులు స్పందించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.