intinti gruhalakshmi serial 7 november 2021 episode
Intinti Gruhalakshmi 7 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. అయితే.. ఆదివారం ఎపిసోడ్ ప్రారంభం కాదు. రేపు 8 నవంబర్, 2021, సోమవారం 471 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, నందు దగ్గరవడం చూసి లాస్య అస్సలు తట్టుకోలేదు. నాకెందుకో తులసి అక్క.. నిన్ను పక్కన పెట్టి బావగారితో దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది అని భాగ్య లాస్యకు చెబుతుంది. మరోవైపు శృతి దేవికి పూజ చేస్తుండగా వచ్చిన అంకిత హారతి పల్లెం లాగేసుకోబోతుంది. దీంతో శృతికి కోపం వస్తుంది. అంకిత తప్పుకో.. ఇలా చేయకు అంటే.. దేవితో నీకు రుణం తీరిపోయింది. నువ్వు దేవికి పూజ చేయొద్దు అని ముందే చెప్పాను కదా అంటుంది అంకిత.
intinti gruhalakshmi serial 7 november 2021 episode
ఎందుకు నామీద నీకు అంత కోపం. నేను ఏం పాపం చేశాను అంటుంది శృతి. నువ్వు నా ఈగోను హర్ట్ చేశావు. నిన్న కాక మొన్న వచ్చి ఆంటి మీద తెగ ప్రేమ ఒలకబోస్తున్నావు. నువ్వేం చేయాలో నేను చెబుతాను. ఇక నుంచి నువ్వు నా ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవ్వాల్సిందే. ఏం చేయాలన్నా నా పర్మిషన్ అడగాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. కాదూ కూడదు అంటూ పెత్తనాలు మొదలు పెడితే నీ సంగతి మామూలుగా ఉండదు అంటుంది అంకిత. ఇది చాలా అన్యాయం అంటే అస్సలు వినదు అంకిత. హారతి పళ్లాన్ని శృతి చేతుల్లో నుంచి తీసుకుంటుంది అంకిత.
తర్వాత తులసి, నందు, లాస్య.. ఆఫీసుకు వెళ్లబోతుండగా వాళ్లకు హారతి ఇచ్చి క్రెడిట్ కొట్టేస్తుంది అంకిత. అక్కడే నందు.. శృతిపై సీరియస్ అవుతాడు. లంచ్ బాక్స్ ను నేను రాములమ్మను అడిగాను అంటూ శృతిపై సీరియస్ అవుతాడు. రాములమ్మను గట్టిగా పిలవగా.. రాములమ్మ వచ్చి నందుకు లంచ్ బాక్స్ ఇస్తుంది.
మరోవైపు ప్రేమ్, శృతి ఇద్దరూ మాట్లాడుకుంటారు. నాన్న నీ చేతితో ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకెళ్లలేదు అని బాధగా ఉంది అంటాడు ప్రేమ్. రాములమ్మ అంతా చెప్పింది శృతి. ఎందుకంత శత్రుత్వం. అయినా ఇంటి కోడలుకు ఇచ్చే విలువ ఇదేనా అంటాడు ప్రేమ్. నా చేత్తో అంకుల్ లంచ్ బాక్స్ తీసుకోకున్నా.. నేను చేసిన వంటే తింటాడు కదా.. అది చాలు నాకు అంటుంది శృతి. దీంతో అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు అంటాడు ప్రేమ్. తర్వాత శృతి అమ్మ చైన్ విడిపించుకొచ్చి ఆ చైన్ ను తనకు ఇస్తాడు ప్రేమ్.
intinti gruhalakshmi serial 7 november 2021 episode
ఏంటి చిట్టెమ్మా.. అంకుల్ నువ్వు చేసిన లంచ్ బాక్స్ తీసుకెళ్లాడని ఫుల్ ఖుషీ అవుతున్నావట అంటుంది అంకిత. అవును అంకిత సంతోషమే కదా అంటుంది శృతి. ఆ తర్వాత లాస్యతో భాగ్య మాట్లాడుతుంది. నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక.. తులసి విడాకులు ఇచ్చాడు. తులసిని కష్టపెట్టడం ఇష్టం లేక నిన్ను పెళ్లి చేసుకోవడం లేదా? పాతికేళ్లు కలిసి కాపురం చేసినా.. మాజీ భార్యాభర్తలు అయినా సరే.. ఇద్దరూ కలిసి పక్కపక్కనే కూర్చోవడం.. విహారయాత్రలు చేయడం.. అబ్బో అంటూ భాగ్య అంటుంది. దీంతో లాస్యకు కోపం వస్తుంది. వాళ్లు విహార యాత్రలను వెళ్లడం లేదు. ఆఫీసుకు అంటుంది లాస్య. ఏది ఏమైనా.. వాళ్లు ఆఫీసుకు వెళ్లాక ఒకే రూమ్ లో ఉంటారు. అప్పుడు వాళ్ల మధ్య ఏం జరిగేది నువ్వు చూస్తావా? అని లాస్యను రెచ్చగొడుతుంది భాగ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.