Intinti Gruhalakshmi Serial Rating of Swinging
Intinti Gruhalakshmi : స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. నిన్నటితో 692 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ సరికొత్త కథనంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.. ఈ సీరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల నుంచి కదలనివ్వకుండా చేస్తోంది.. కానీ టిర్పి రేటింగ్ లో మాత్రం ఇంటింటి గృహలక్ష్మి అనుకున్నంత స్థాయికి చేరుకోలేక పోతుంది.. గతవారం నాలుగో స్థానంలో నిలిచిన ఈ సీరియల్ ఈ వారంలో కాస్త పెరిగింది.. తాజాగా విడుదలైన స్టార్ మా టిఆర్పి రేటింగ్స్ లో రేటింగ్స్ లో 10.11 రేటింగ్ ను సొంతం చేసుకుని ఇంటింటి గృహలక్ష్మి మూడవ స్థానంలో నిలిచింది.. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ నాలుగవ స్థానం మూడవ స్థానాల మధ్య ఇంటింటి గృహలక్ష్మి ఊగిసలాడుతుంది.. ఈ వారం జరిగిన ఎపిసోడ్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
ఇంటింటి గృహలక్ష్మి తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి..!?తులసి అమ్మవారికి బోనం సమర్పించగానే.. ఒక మనిషికి అమ్మవారు ఒంటి మీదకు వచ్చి ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు.. ఇకనుంచి నీకు అలాంటి సమస్యలు ఏమి ఉండవు. నీ జీవితంలోకి ఒక మనిషి రాబోతున్నాడు అని తెలియజేస్తుంది.. అతనే సామ్రాట్.. హనీ అంటే సామ్రాట్ కు ప్రాణం.. అటువంటి హనీ ప్రాణాపాయ స్థితిలో ఉందని.. హనీని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకున్న సామ్రాట్.. ముందు వెనుక ఆలోచించకుండా తులసి దగ్గర హనీ ఉంది అని తెలుసుకొని తనను జైల్లో పెట్టిస్తాడు..తులసి నేను అసలు ఏమి చేయలేదని నెత్తి నోరు కొట్టుకున్న సామ్రాట్ వినడు.. మరోసారి తులసి హనీ జోలికి రాకుండా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు సామ్రాట్.. వాళ్ల నాన్న చేసిన తప్పుని హనీ సరిదిద్దుకోవడం కోసం తులసి వాళ్ళ ఇంటికి వెళ్లి సారీ చెబుతుంది.. ఆ ప్రయత్నంలో హనీ చైన్ వాళ్ళ ఇంటి పెరట్లో పడిపోతుంది..
Intinti Gruhalakshmi Serial Rating of Swinging
ఈసారి కూడా చైన్ దొంగతనం చేసింది తులసి అని.. మరోసారి ఇల్లంతా వెతికిస్తాడు సామ్రాట్.. కానీ ఇంట్లో ఆ చైన్ ఎక్కడ కనిపించదు .. చివరికి పెరట్లో ఆ చైన్ దివ్యకు దొరకగానే.. తులసి ఆ చైన్ తీసుకువెళ్లి సామ్రాట్ కు ఇస్తుంది.. మీకు ఆ చేయి మీ చెల్లెలు జ్ఞాపకం అని చెప్పారు అందుకే ఈ చైను నేనే తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది తులసి..తులసి ఏదో పని మీద స్కూల్ కి వెళ్తే అదే స్కూల్లో హనీ కూడా చదువుకుంటుంది.. తులసిని చూసినా హనీ స్పీడ్ స్పీడ్ గా లిఫ్టులో నుంచి కిందకు రావాలి అనుకుంటుంది.. అంతలో లిఫ్ట్ స్టక్ అవుతుంది.. తులసి హనీ కళ్ళు తిరిగిపోకుండా ధైర్యాన్ని అందించి హనీ ని కాపాడుతుంది..
అప్పుడు తులసి మంచితనం గురించి సామ్రాట్ కు అర్థమవుతుంది కానీ సామ్రాట్ తన కోసం బ్లాక్ చికెన్ పంపిస్తాడు తులసి ఆ చెక్కను కూడా రిజెక్ట్ చేస్తుంది. సరే అని సంగీతం స్కూల్ కోసం బ్యాంకు మేనేజర్స్ ని లోన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి పంపిస్తారు.. అక్కడ కూడా సామ్రాట్ కి వైఫల్యం ఎదురవుతుంది.. నందు వాళ్లు నిర్వహిస్తున్న బిజినెస్ ఐడియాలో తన ఐడియాను కూడా షేర్ చేసుకోవాలని వాళ్ళ కంపెనీకి వెళ్తుంది.. అంతలో లాస్ అయి తన ఫైల్ ని తీసుకుంటుంది.. కానీ ఈసారి సామ్రాట్ తులసి ఫైల్ ను ఓకే చేస్తాడు తనకి కూడా అవకాశం ఇస్తాడు.. కానీ తులసి ఆఫర్ ను ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. బహుశా ఈసారి ఒప్పుకుంటుంది అని అనిపిస్తుంది.. ఈ సీన్ తో వచ్చేవారం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరగనుంది..
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.