Nara Brahmani : బ్రాహ్మిణీని మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నా బాలయ్య .. కానీ చివరికి ఇలా జరిగిందట ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Brahmani : బ్రాహ్మిణీని మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నా బాలయ్య .. కానీ చివరికి ఇలా జరిగిందట ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :30 September 2023,10:00 am

Nara Brahmani : టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో నటిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరిగా మారారు. హీరోగా మంచి సక్సెస్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ గుంటూరు కారం ‘ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఇక మహేష్ బాబు వ్యక్తిగత విషయానికొస్తే బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను వ్యవహరిస్తూ ఫ్యామిలీ లైఫ్ ని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి అయినప్పటికీ అచ్చమైన తెలుగు ఇంటి కోడలుగా కుటుంబ బాధ్యతలను వ్యవహరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు నమ్రత తో మహేష్ బాబు వైవాహిక జీవితంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు.

Intresting news about Mahesh babu and Balakrishna daughter nara Brahmani

Intresting news about Mahesh babu and Balakrishna daughter nara Brahmani

అయితే తాజాగా సోషల్ మీడియాలో మహేష్ బాబు గురించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ గా మారింది. నటసింహం బాలయ్య మొదటగా తన కుమార్తె బ్రాహ్మిణీని మహేష్ బాబు కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. అప్పట్లో ఈ వార్త సంచలనగా మారింది. ఇదే వార్త మరోసారి వెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు చూడడానికి చాలా అందంగా ఉంటారు. అలాగే స్టార్ హీరో. గొప్ప సినీ నేపథ్యమున్న ఫ్యామిలీ కావడంతో మహేష్ బాబును అల్లుడు చేసుకోవాలని భావించారట. అయితే అప్పటికే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో ఉన్నారు. దీంతో మహేష్ బాబు బాలయ్య ప్రపోజల్ ను రిజెక్ట్ చేశారట. అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది