Samantha : త్వరలో తల్లి కాబోతున్న సమంత .. రెండో పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : త్వరలో తల్లి కాబోతున్న సమంత .. రెండో పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు..!

Samantha : సౌత్ ఇండియన్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నారు సమంత. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించిన ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలలో క్రేజ్ పెంచుకుంటూ లైఫ్ లో దూసుకెళుతున్నారు. సినీ కెరీర్లో మంచి సక్సెస్ ను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. భర్త నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం, ఆమెపై వచ్చిన ట్రోల్స్ , ఆరోపణలు ఇవన్నీ కూడా ఆమెను కుంగదీసాయి. […]

 Authored By anusha | The Telugu News | Updated on :22 November 2023,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : త్వరలో తల్లి కాబోతున్న సమంత ..

  •  సమంత రెండో పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు..!

Samantha : సౌత్ ఇండియన్ బ్యూటీగా పేరు సంపాదించుకున్నారు సమంత. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించిన ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలలో క్రేజ్ పెంచుకుంటూ లైఫ్ లో దూసుకెళుతున్నారు. సినీ కెరీర్లో మంచి సక్సెస్ ను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. భర్త నాగచైతన్యతో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం, ఆమెపై వచ్చిన ట్రోల్స్ , ఆరోపణలు ఇవన్నీ కూడా ఆమెను కుంగదీసాయి.

విడాకులు తర్వాత వెంటనే ఆమెకు అనారోగ్య సమస్య చుట్టుముట్టింది. గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఏడాది నుంచి ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటున్న ఇంకా క్యూర్ కాలేదు. ఇటీవల సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలలో ట్రీట్మెంట్ కోసం వెళ్లారు. ఇదిలా ఉండగా 36 ఏళ్ల వయసు దాటిపోవడంతో సమంత కి మళ్లీ పెళ్లి చేయాలని ఉద్దేశంతో తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారట. అయితే సమంత మాత్రం తన జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యారట.

ఇకపై ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారట. సమంత నటిగా, సోషల్ వర్క్ కు అంకితం చేయబోతున్నట్లు తెలుస్తుంది. తల్లి కావాలన్నా ఆమె కోరిక కి భవిష్యత్తులో ఇద్దరు పిల్లలు దత్తత తీసుకొని, వారికి తల్లిగా ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉండాలని సమంత నిర్ణయం తీసుకుందట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సమంత 2014 నుంచి ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ రన్ చేస్తూ ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని అమ్మ అవుతారని తెలుస్తుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది