Trisha : త్రిష కత్తి లాంటి ఫిగర్.. కానీ దానికి మాత్రం అస్సలు పనికిరాదట.. ప్చ్.. అంత అందం ఉండి ఏంటి లాభం?
Trisha : సినిమా ఇండస్ట్రీ అంటేనే అదో మాయా లోకం. అక్కడ లక్కులు గిక్కులు పని చేయవు. హార్డ్ వర్క్ కూడా పని చేయదు. ఒక్కోసారి కమిట్ మెంట్ పని చేస్తుంది. లక్ కూడా ఆవగింజంత ఉండాలి. లేకపోతే ఏం చేయలేం. అలా అందంతో పాటు లక్ కలిసి రావడంతో చాలామంది స్టార్ హీరోయిన్లు అయ్యారు. అందులో త్రిష ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో టాప్ గా నిలిచింది. రెండు దశాబ్దాల పాటు రెండు ఇండస్ట్రీలను ఏలింది.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరోల సరసన నటించిన త్రిష మూడు పదుల వయసు దాటినా కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఇంకా తన సత్తా చాటుతోంది. ఇప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది త్రిష. అంతా బాగానే ఉంది కానీ.. త్రిష అసలు పెళ్లి చేసుకోవడం లేదు. ఇదివరకు ఒకసారి పెళ్లి పీటల వరకు ఎక్కినా పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది.
Trisha : పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు?
నిశ్చితార్థం అయ్యాక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది త్రిష. ఈమె సినిమాలకు, నటనకు పనికొస్తుంది కానీ.. ప్రేమకు మాత్రం అన్ ఫిట్. తను ప్రేమకు పనికిరాదు అని అంటున్నారు. తన జీవితంలో పెళ్లికి స్థానం లేదు అంటున్నారు. ఇంత అందంగా ఉన్న త్రిష అసలు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు.. తనకు నిజంగానే పెళ్లి చేసుకునే యోగం లేదా అని నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.