ఆలియా భట్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఆలియా భట్ ని రాజమౌళి ఎంచుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ కి ముందే ఆలియా భట్ టాలీవుడ్ ఎంట్రీ జరగాల్సింది. కాని కుదరలేదు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ ఉన్న హీరోయిన్స్ మన టాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. కాని వాళ్ళలో కొంతమందికి మన తెలుగు వాళ్ళు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ఆ ప్రభావం సినిమా మీద భారీగా పడుతోంది. అందుకు ఉదాహరణ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సాహో అని చెప్పాలి.
ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. శ్రద్ద కపూర్ కి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తీ కపూర్ కూతురుగా తీన్ పత్తి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆషికీ 2 తో స్టార్ హీరోయిన్ గా మారింది శ్రద్దా కపూర్. ఇక ఆ తర్వాత వరసగా ఏక్ విలన్, హైడర్, రాక్ ఆన్ 2, ఏబిసిడి 2, భాగీ, లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ క్రమంలోనే మన ప్రభాస్ నటించిన సాహో తో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
కానీ సాహో ఒక్క బాలీవుడ్ లో తప్ప మిగిలిన అన్నీ భాషల్లో ఫ్లాప్ మూవీగా నిలిచింది. మిగతా భాషల సంగతి అటుంచితే మన వాళ్ళకి శ్రద్దా కనెక్ట్ కాలేదు. ఇప్పుడే అదే ఆలియా విషయంలో ఆర్ ఆర్ ఆర్ కి జరుగుతుందా అన్న టాక్ మొదలైందట. ఆలియా భట్ కూడా మొదటిసారి టాలీవుడ్ లో అది కూడా భారీ మల్టీస్టారర్ అయిన ఆర్ ఆర్ ఆర్ లో రాం చరణ్ కి జంటగా నటిస్తోంది. మరి ఆలియా మన తెలుగు వాళ్ళని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే ఆలియా మీద రాజమౌళి మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ లో గనక మెప్పిస్తే ఆ తర్వాత భారీ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.