అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటోంది. అఖిల్ నటించిన అఖిల్, మిస్టర్ మజ్ఞు, హలో సినిమాల రిలీజ్ విషయంలో ఇన్ని వాయిదాలు పడలేదనే చెప్పాలి. కాని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విషయంలో మాత్రం రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ అక్కినే ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతోంది. అఖిల్ కెరీర్ లో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. గత కొంత కాలంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా సరైన హిట్ లేకపోవడం తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో ఎలాగైనా భారీ హిట్ కొట్టి మళ్ళీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతక ముందు ఇదే నిర్మాణ సంస్థ నుంచి విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ గీత గోవిందం తరహాలోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ని రూపొందిస్తున్నారట. అందుకే చిత్ర యూనిట్ తో పాటు నాగార్జున కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు. వాస్తవంగా అయితే ఈ సమయానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ప్రమోషన్స్ లో పీక్స్ చేరుకోవాల్సింది. ఎందుకంటే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ వెల్లడించారు కాబట్టి.
కాని ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ లేకుండా పోయింది. అసలు సంక్రాంతి కాదు కదా ఫిబ్రవరి లేదా మార్చ్ లో వస్తుందా అన్నది కూడా మేకర్స్ నుంచి అప్‌డేట్ రావడం లేదు. అయితే రీషూట్ జరిగిన సీన్స్ తో సినిమా బెటర్ గా వచ్చిందని అంటున్నారు. కాగా ఈ సినిమాని సమ్మర్ వరకు రిలీజ్ చేద్దామనుకున్నా చాలా నెలలు ఆగాల్సి వస్తుందన్న కారణంగా ఒక ఆప్షన్ గా ఓటీటీ కి వెళ్ళాలని దర్శక, నిర్మాతలు కొత్త ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో నాగార్జున ఎంత మాత్రం కుదరదనే చెబుతున్నట్టు సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని పట్టుబడి ఉన్నాడట. చూడాలి మరి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఎలా రిలీజ్ చేస్తారో.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.