సమంత .. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ క్రేజీ హీరోయిన్. ఇప్పుడు ఆహా లో సాం జాం టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేస్తోంది. ఈ షో తో జనాలకి బాగానే ఎంటర్‌టైన్ చేస్తోంది. అంతేకాదు సమంత నటించిన ఫస్ట్ డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 త్వరలో అమెజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ కాబోతోంది. కాగా సమంత – నాగ చైతన్య ఏ మాయ చేశావే సినిమా నుంచి మజిలీ వరకు నటించిన సినిమాలు అక్కినేని ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. సమంత – నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలలో ఒక్క ఆటోనగర్ సూర్య తప్ప మిగతా సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.
ఇక పెళ్ళి తర్వాత నాగ చైతన్య – సమంత నటించిన మజిలీ ఇద్దరి కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. అయితే ఈ సినిమా తర్వాత సమంత ఓ బేబీ, జాను సినిమాలు చేసింది. ఈ సినిమాలలో ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. కాని జాను భారీ డిజాస్టర్ గా మిగిలింది. వాస్తవంగా జాను సినిమాలో కూడా నాగ చైతన్య – సమంత కలిసి నటించాల్సి ఉందట. కాని నాగ చైతన్య కి కథ నచ్చక డ్రాపయ్యాడు. సమంత నటించి ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది. కాగా మజిలీ తర్వాత అలాంటి కథ ఉంటే ఇద్దరం కలిసి నటిస్తామని కొందరు దర్శక, రచయితలకి చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్త కంప్లీట్ గా రూమర్ అని తేలిపోయింది. రీసెంట్ గా నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా కంప్లీట్ చేశాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కాగా తాజాగా మనం ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. హాకీ ప్లేయర్ గా నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో సమంత ని హీరోయిన్ గా తీసుకుందామని దర్శకుడు విక్రం కుమార్, నిర్మాత దిల్ రాజు చెప్పగా నాగ చైతన్య సింపుల్ గా రిజెక్ట్ చేశాడట. మజిలీ వచ్చింది ఈ మధ్యనే కదా మళ్ళీ మా ఇద్దరిని కలిసి చూడాలంటే జనాలకి నచ్చదేమో .. వేరే అమాయిని తీసుకుందామని సమంత ని రిజెక్ట్ చేశాడట. ఆ రకంగా తాజా థాంక్యూ సినిమా లో సమంత నటించే ఛాన్స్ మిస్ అయిందట.
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
This website uses cookies.