
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దర్శకులు.. నిర్మాతలు.. హీరోలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొంతమంది నటులకైతే ఒక్క సీన్ లో అయినా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే చాలనుకుంటారు. వీళ్ళే కాదు దర్శక, నిర్మాతలు కూడా కెరీర్ మొత్తం లో పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేయాలని ఏళ్ళగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో చేసిన సినిమా జీవితాంతం నిలిచిపోతుంది. ఈ విషయంలో పదేళ్ళుగా కల కంటున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా నిర్మించి ఆ కల నెరవేర్చుకున్నాడు.
ఈ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. వాస్తవంగా సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి తర్వాత సినిమా చేయాల్సింది. అది కూడా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన తేరీ అన్న సినిమా. ఈ సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది కూడా. పవన్ కళ్యాణ్ – సంతోష్ శ్రీనివాస్ మధ్య చర్చలు జరిగాయి. ఇక ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందనగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళిపోయారు. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఎందుకనో ఈ సినిమాని మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ 6 సినిమాలని కమిటయి ఉన్నాడు. అవన్ని పూర్తవ్వాలంటే ఖచ్చితంగా 2022 దాటిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ – సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ మొదలవ్వాలంటే సంవత్సరం పైనే సమయం పడుతుందంటున్నారు. ఇక దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాత్రం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని పవన్ కళ్యాణ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతోంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇంకా ఈ దర్శకుడు వెల్లడించలేదు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.