నాగార్జున : నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ నటి దియా మిర్జా తో పాటు సయామీఖేర్ కీలక పాత్రలో నటించగా నాగార్జున ఎన్.ఐ.ఎ ఆఫీసర్ గా నటించాడు. ఇక ఈ సినిమా చాలా కాలం తర్వాత నాగార్జున కి హిట్ తీసుకు వచ్చిందని చెప్పాలి. ఇలాంటి జోనర్స్ లో నాగార్జున సినిమా చేసి చాలా ఏళ్ళు అవుతోంది. అందుకే ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపించారు.
ఇక ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న నాగార్జున వైల్డ్ డాగ్ కి థియేటర్స్ లో కంటే భారీ రెస్పాన్స్ వచ్చింది. స్మాల్ స్క్రీన్ మీద ఈ సినిమా భారీ హిట్ అన్న విధంగా దూసుకుపోతోంది. కాగా నాగార్జున మరోసారి యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆపేశారు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఒకే జోనర్ సినిమా ఎందుకు అన్న ఆలోచన నాగ్ కి వచ్చిందట.
ఈ ఆలోచనతోనే ఇప్పుడు ప్రవీణ్ సత్తారు సినిమాని ఆపేసి సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వెల్ ని సెట్స్ మీదకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. బంగార్రాజు టైటిల్ తో ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించబోతున్నాడు. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతుండగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నాడు. అయితే అఫీషియల్ గా నాగార్జున గానీ దర్శకుడు ప్రవీన్ సత్తారు గానీ ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్టు తెలపలేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.