Bangarraju : బంగార్రాజు కోసం ఆ సినిమాని ఆపేస్తున్న నాగార్జున..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bangarraju : బంగార్రాజు కోసం ఆ సినిమాని ఆపేస్తున్న నాగార్జున..?

 Authored By govind | The Telugu News | Updated on :28 April 2021,9:43 am

నాగార్జున : నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ నటి దియా మిర్జా తో పాటు సయామీఖేర్ కీలక పాత్రలో నటించగా నాగార్జున ఎన్.ఐ.ఎ ఆఫీసర్ గా నటించాడు. ఇక ఈ సినిమా చాలా కాలం తర్వాత నాగార్జున కి హిట్ తీసుకు వచ్చిందని చెప్పాలి. ఇలాంటి జోనర్స్ లో నాగార్జున సినిమా చేసి చాలా ఏళ్ళు అవుతోంది. అందుకే ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపించారు.

is nagarjuna stops that movie for bangarraju

is nagarjuna stops that movie for bangarraju…?

ఇక ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న నాగార్జున వైల్డ్ డాగ్ కి థియేటర్స్ లో కంటే భారీ రెస్పాన్స్ వచ్చింది. స్మాల్ స్క్రీన్ మీద ఈ సినిమా భారీ హిట్ అన్న విధంగా దూసుకుపోతోంది. కాగా నాగార్జున మరోసారి యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆపేశారు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఒకే జోనర్ సినిమా ఎందుకు అన్న ఆలోచన నాగ్ కి వచ్చిందట.

నాగార్జున : బంగార్రాజు సినిమాని నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నాడు.

ఈ ఆలోచనతోనే ఇప్పుడు ప్రవీణ్ సత్తారు సినిమాని ఆపేసి సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వెల్ ని సెట్స్ మీదకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. బంగార్రాజు టైటిల్ తో ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించబోతున్నాడు. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించబోతుండగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నాడు. అయితే అఫీషియల్ గా నాగార్జున  గానీ దర్శకుడు ప్రవీన్ సత్తారు  గానీ ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్టు తెలపలేదు.

 

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది