Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ అనుకున్నది ఒకటీ అయిందొకటి..నయనతార రేంజ్ ఊహించుకుందే పాపం..!

Authored By vamana sai | The Telugu News | Updated on: April 21, 2022, 6:42 pm

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ అనుకున్నది ఒకటీ అయిందొకటి..నయనతార రేంజ్ ఊహించుకుందే పాపం..! అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. అందుకు కారణం బాలకృష్ణ, బోయపాటి శ్రీను..వీరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా. కంచె సినిమాతో డీసెంట్ హీరోయిన్‌గా ప్రగ్యాకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఆ క్రేజ్‌ను ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం తెలుసుకోలేకపోయింది. సాయి పల్లవి మాదిరిగా అటు డీసెంట్ రోల్స్‌కు ఫిక్సవకుండా..పూజా హెగ్డే, రష్మికల మాదిరిగా ఇటు గ్లామర్ రోల్స్‌కు డిసైడవకుండా కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకుంది.

మొదటి సినిమా తర్వాత అవకాశాలు వచ్చినా కూడా ప్రగ్యాకు ఆశించిన సక్సెస్‌లు దక్కలేదు. అమ్మడి హైట్..చేసే గ్లామర్ రోల్స్‌కు స్టార్ హీరోయిన్‌గా పోటీ పడాల్సింది. కానీ, అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆమె సరైన కథలను ఎంచుకోకపోవడమే. పెద్ద దర్శకులైన కృష్ణవంశీ, బోయపాటి శ్రీను లాంటి వారి సినిమాలలో నటించినా కూడా అమ్మడికి కలిసి రాలేదు. అదే ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే, ప్రగ్యా డేట్స్ ఇప్పుడు కష్టమయ్యేవే. చేసిన సినిమాలు ఫ్లాపవుతుండంతో చేతిలో అవకాశాలే లేకుండా పోయాయి.

is Pragya Jaiswal could not reach her expectations

is Pragya Jaiswal could not reach her expectations

Pragya Jaiswal : ప్రగ్యా కూడా నిజంగా అదే రేంజ్ ఊహించుకుంది.

ఎట్టకేలకు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ప్రగ్యా కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్రను దర్శకుడు బోయపాటి సింహ సినిమాలో నయనతార రేంజ్‌లో డిజైన్ చేశాడని అఖండ రిలీజ్‌కు ముందు అనుకున్నారు. కానీ, అంత ఇంపాక్ట్ లేదని తర్వాత అర్థమైంది. ప్రగ్యా కూడా నిజంగా అదే రేంజ్ ఊహించుకుంది. కానీ, అఖండ అంత భారీ హిట్ సాధించినా కూడా క్రెడిట్ మొత్తం హీరో బాలకృష్ణకు.. దర్శకుడు బోయపాటికే దక్కింది. ఈ సినిమాతో ప్రగ్యాకు ఒరిగింది మాత్రం ఏమీ లేదనే నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఈ పాటికి కనీసం రెండు భారీ చిత్రాలలో అయినా హీరోయిన్‌గా అవకాశాలు అందుకునేదే..అంటున్నారు. చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp