Rashmi Gautam – Sudigali Sudheer : రష్మి, సుడిగాలి సుధీర్ ల పెళ్లి చూడటమే నా చివరి కోరిక: జబర్దస్త్ కమెడియన్..అంటే పెళ్ళి ఫిక్సైందా..?

Authored By vamana sai | The Telugu News | Published on: August 10, 2021, 7:00 am

Rashmi Gautam – Sudigali Sudheer: రష్మి గౌతమ్ – సుడిగాలి సుధీర్ ల జంటకి బుల్లితెర మీద ఎంత క్రేజ్, పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే. ఎన్ని ఎపిసోడ్స్ అయినా వీరిని జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. నిజంగా వీరిద్దరు పెళ్ళి చేసుకుంటారేమో అని మాట్లాడుకునేవాళ్లు..చేసుకుంటే బావుంటుందనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు. స్మాల్ స్క్రీన్ మీద వీరిద్దరికి పెర్‌ఫెక్ట్ జోడీ. స్టార్ హీరో హీరోయిన్ కలిసి వరుసగా మూడు నాలుగు సినిమాలు చేస్తే హిట్ పెయిర్ అంటూ అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఎలాగైతే విపరీతమైన క్రేజ్ ఉంటుందో అదే క్రేజ్ రష్మి గౌతమ్ – సుడిగాలి సుధీర్ లకి ఉంది.

is rashmi-gautam-sudigali-sudheer marriage fixed

is rashmi-gautam-sudigali-sudheer marriage fixed

ఎంత కాదనుకున్న ఖచ్చితంగా వీరిద్దరి మీద షోలో ఒక్కసారైనా టాపిక్ రాకుండా లేకుండా ఉండదు. అలా టాపిక్ వచ్చిన ప్రతీసారీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సిగ్గుపడటం, ఓర చూపులు చూసుకుంటూ కవ్వించటం, నిజంగా ప్రేమికుల్లా ప్రవర్తించడం జనాలకి బాగా నచ్చుతుంది.

ఇప్పటికే షోలో భాగంగా ఘనంగా ఇద్దరికీ పెళ్ళి జరిపించారు. ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల చాలామంది వీరు నిజంగా పెళ్ళి చేసుకున్నారా..అని కన్‌ఫ్యూజన్ లో పడ్డారు. బయట వీరు ఎన్నిసార్లు మేము స్కిట్స్‌లో భాగంగానే అలా బిహేవ్ చేస్తాము తప్ప మా మధ్య ఏమీలేదని చెప్పిన సందర్భాలున్నాయి.

Rashmi Gautam – Sudigali Sudheer: జనాలు రష్మి గౌతమ్ – సుడిగాలి సుధీర్ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఆశపడ్డారు.

అయితే ఇన్నాళ్లు బయట జనాలు రష్మి గౌతమ్ – సుడిగాలి సుధీర్ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఆశపడ్డారు. కానీ ఏకంగా ఇప్పుడు ఓ జబర్దస్త్ కమెడియన్ రష్మీ – సుధీర్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందన్నాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే మరో కామెడీ షో వస్తోంది. ఇందులో ఓ స్కిట్‌లో భాగంగా మీ చివరి కోరిక ఏంటి అంటూ అక్కడున్న వాళ్లందర్నీ సుధీర్ ప్రశ్నలు అడిగాడు. అక్కడున్న 20 మంది కమెడియన్లు ఒక్కోలా ఆన్సర్స్ చెప్పారు. వారిలోనే సుడిగాలి సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ కూడా ఉన్నాడు. ఆటో రామ్ ప్రసాద్‌ను కూడా చివరి కోరిక ఏంట్రా అంటూ అడిగాడు సుధీర్. దానికి అతను ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు. నా చివరి కోరిక రష్మి – సుధీర్ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉందన్నాడు. దానికి వెంటనే సుధీర్ ఏదైనా జరిగేది చెప్పారా అంటూ కౌంటర్ పంచ్ వేశాడు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp