Rasikhanna : రాశీఖన్నా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఈ మధ్య కోలీవుడ్ లో కూడా దాదాపు అరడజను సినిమాలకి సైన్ చేసి అక్కడ స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరబోతోంది. మారుతి దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన ప్రతీ రోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఈ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో ఎందుకనో ఈ అందాల రాశి కి అవకాశాలు రాలేదు. కోలీవుడ్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పటికీ ఆమె దృష్ఠి మొత్తం టాలీవుడ్ మీదే ఉందని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
is rasikhanna-ready to romance with that hero…
అయితే మళ్ళీ మారుతినే రాశీకి అవకాశం ఇచ్చాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ అన్న సినిమా మొదలైంది. ఈ సినిమాలో రాశీఖన్నాని హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారకంగా మాత్రం వెల్లడి కాలేదు. మరికొన్ని సినిమాలకి టాలీవుడ్ లో రాశీ ఖన్నా పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా తాజాగా నాగచైతన్యతో దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. థాంక్యూ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని సమాచారం. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుల్ మోహన్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కాగా ఒకరు మాత్రం స్టార్ హీరోయిన్ కావాల్సి ఉండగా పూజా హెగ్డే, రష్మిక మందన్నల పేరు ప్రచారం లో ఉంది. ఈ క్రమంలో మరో హీరోయిన్ గా అందాల రాశీఖన్నాకి అవకాశం దక్కినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య తో కలిసి రాశీ వెంకీ మామ సినిమాచేసి హిట్ కొట్టింది. మళ్ళీ నాగ చైతన్య తో అంటే మంచి అవకాశం అని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. కాగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.