Renu Desai : రెండో పెళ్లి పై రేణు దేశాయ్ ఫుల్ క్లారిటీ గా ఉందా..?
Renu Desai : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, నటి రేణు దేశాయ్ (Renu Desai) మరోసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, రెండో పెళ్లి గురించి స్పందిస్తూ తాను రెండోసారి పెళ్లి బంధంలోకి రావాలనుకున్నా, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచన నుంచి వెనక్కి వచ్చానని పేర్కొన్నారు. ‘‘నాకు కూడా జీవితంలో ఓ సపోర్ట్ ఉండాలని అనిపిస్తుంది. కానీ నా ఇద్దరు పిల్లలు అకీరా, Akira, Adhya, ఆధ్య కోసం త్యాగం చేయాల్సి వచ్చింది’’ అంటూ ఆమె తెలిపింది. పిల్లల మనసులో మరో వ్యక్తిని తల్చుకునే స్థితి రావొద్దన్న అభిప్రాయంతోనే తాను ఇప్పటి వరకు పెళ్లికి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇదే సందర్భంలో గతంలో రేణు దేశాయ్ (Renu Desai) చేతిలో ఎంగేజ్‌మెంట్ రింగ్ పెట్టుకుని ఫొటో పోస్ట్ చేయగా, ఆమె త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వచ్చిన విషయం గుర్తు చేస్తోంది. అయితే ఆ తర్వాత ఆ విషయంపై ఆమె మళ్లీ స్పందించకపోవడం, ఇప్పుడు ఆమె చేసిన తాజా వ్యాఖ్యలతో ఆ వార్తలు నిరాధారమేనని తేలిపోతున్నాయి. రేణు తన జీవితాన్ని పిల్లలతోనే నింపుకోవాలనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, ప్రజలకు సేవ చేయాలనిపించినా, రాజకీయాల్లో తనకు సరిపోదని భావిస్తున్నట్లు తెలిపారు.
Renu Desai : రెండో పెళ్లి పై రేణు దేశాయ్ ఫుల్ క్లారిటీ గా ఉందా..?
ఇక తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై కూడా రేణు దేశాయ్ (Renu Desai) స్పష్టత ఇచ్చారు. అకీరా ఓజీ సినిమాలో కనిపించనున్నాడని వస్తున్న జోరుగా ప్రచారం అవాస్తవమని తేల్చారు. ‘‘అకీరా సినిమాల్లోకి వస్తే ఆ విషయాన్ని నేనే అధికారికంగా చెబుతా. ఇప్పటివరకు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడైతే అతనికి ఆసక్తి ఉంటే, అతనిదే చివరి నిర్ణయం’’ అని చెప్పారు. ఒక తల్లిగా తన కుమారుడిని వెండితెరపై చూడాలనేది తన కోరికైనా, ఫోర్స్ చేయబోనని స్పష్టం చేశారు.
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…
Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన…
Health Tips | మన భారతీయ ఆహార వ్యవస్థలో గుడ్డు అనేది ముఖ్యమైన పోషకాహారంగా మారింది. అయితే గుడ్డులోని తెల్లసొన మాత్రమే…
This website uses cookies.