Samantha : నాగ చైతన్య అంటే సమంతకు ఇంకా ఇష్టం… ఇదే సాక్ష్యం అంటున్న ఫ్యాన్స్‌…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :2 January 2023,9:40 am

Samantha : నాగ చైతన్య మరియు సమంత ఒక చక్కని జంట అంటూ ఎంతో మంది మాట్లాడుకునేవారు. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రకటన వచ్చిన సమయంలో చాలా మంది షాక్ అయ్యారు. సమంత వంటి స్టార్ హీరోయిన్ మొహమాటస్తుడైన నాగ చైతన్యతో ప్రేమలో ఎలా పడింది అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. వారిద్దరి జంట ఏ మాయ చేసావే నుండి మొదలైంది. మనం సినిమాలో వారిద్దరి నటనకు నిజంగా వీరు భార్యా భర్తల అన్నట్లు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అభిమానం ఉండడంతో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ కొన్నాళ్లకే విడిపోయారు. కారణాలు ఏంటో కానీ ఒకరిపై ఒకరికి ఇంకా ప్రేమ ఉందా అంటే ఉంది

అనే సమాధానం ఎక్కువ మంది నుండి వస్తుంది. తాజాగా సమంత అభిమానులతో పాటు మరి కొందరు సోషల్ మీడియా లో ఆసక్తికర ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే సమంత కు ఇంకా నాగ చైతన్య అంటే ప్రేమ అభిమానం ఉంది. అందుకే ఆమె చేతి పై టాటు చెరగలేదు. చైతన్య మరియు సమంత కలిసి ప్రేమలో ఉన్న సమయంలో ఆ టాటూ ను వేయించుకున్నారు. ఆ టాటూ సమంత చేతికి ఇప్పటికీ ఉండడంతో అతడి జ్ఞాపకాల్లో సమంత బతికేస్తుంది అంటున్నారు. సమంత ఇప్పటికైనా నాగ చైతన్యతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉంది అంటూ కొందరు ఆ టాటూను సాక్ష్యంగా చూపించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

is Samantha still in love with Naga Chaitanya

is Samantha still in love with Naga Chaitanya

నాగ చైతన్య చేతికి మాత్రం టాటూ కనిపించడం లేదు. ఆయన కవర్ చేస్తున్నాడా లేదంటే రిమూవ్ చేశాడా అనేది తెలియాల్సింది. ఇక సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో నాగ చైతన్య నుండి ఓదార్పు లభిస్తుందని చాలా మంది భావించారు. కానీ అది ఆమెకు చైతూ ఓదార్పు దక్కలేదు. ఒక్కవైపు ప్రేమ ఉంటే ఏ మాత్రం కరెక్ట్ కాదు.. రెండు వైపులా ప్రేమ ఉంటేనే కరెక్ట్. కనుక సమంత ఒక్కతే నాగ చైతన్యను ప్రేమించడం కరెక్ట్ కాదని, ఇప్పటికైనా అతడిని మర్చి పోయి కొత్త జీవితంలో అడుగు పెట్టాలని ఆమె అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి