is sonal chauhan balakrishna heroine
Sonal Chauhan: ఓ హీరోతో ఏ హీరోయిన్ అయినా వరుసగా సినిమాలు చేస్తే ఇక ఆ హీరోయిన్‌ను పలానా హీరోకి కలిసొచ్చిందనో..మరేదో కొత్త పేరు పెట్టో పిలుచుకోవడం ఫ్యాన్స్‌కు ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. అలా సోనాల్ చౌహాన్‌ను అందరూ బాలయ్య హీరోయిన్ అని పిలుచుకుంటున్నారు. జన్నత్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో హ్యాపీడేస్ ఫేం రాహుల్ సరసన రేయిన్‌బో అనే సినిమాతో పరిచయమైంది. అయితే, ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయినా కూడా కొన్నేళ్లకి అదృష్టం అమ్మడి తలుపు తట్టి ఏకంగా బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలో అవకాశం అందుకుంది.
ఈ సినిమానే లెజెండ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనాల్ తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. గొప్ప పర్ఫార్మర్ కాకపోయినా మేకర్స్ బాలయ్యకు సెట్ అయిందని తీసుకున్నారు. అలా బాలకృష్ణతో మూడు సినిమాలు చేసింది. రూలర్, డిక్టేటర్. వీటిలో సోనాల్‌కు లెజెండ్ సినిమా మాత్రం హిట్ ఇచ్చింది. మిగతా రెండు సినిమాలు ఫ్లాప్‌గానే మిగిలాయి. అయితే, ఈమె ఒక్క బాలయ్య సినిమాలో మాత్రమే నటించిందా అంటే కాదు. రాం సరసన పండగ చేసుకో..అనుష్క నటించిన సైజ్ జీరో సినిమాలు చేసింది.
is sonal chauhan balakrishna heroine
ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ఆదిపురుష్ మూవీలో కీలక పాత్రలో కనిపించ బోతోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు – కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. వాస్తవంగా ఈ సినిమాలో ముందు ఎంపికైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే ఆ అవకాశం వారూ..వీరూ అని చివరికి సోనాల్‌కు దక్కింది. మొత్తానికి టాలీవుడ్‌లో బాలయ్య హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సోనాల్‌కు మన మేకర్స్ పుణ్యమా అంటూ బాగానే నెట్టుకొస్తోంది. ఇదంతా ‘జై బాలయ్య’ చలువే అని చెప్పక తప్పదు.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.