Sonal Chauhan : వారి పుణ్యమా అని బాలయ్య హీరోయిన్ బాగానే నెట్టుకొస్తోందే..

Authored By vamana sai | The Telugu News | Published on: April 24, 2022, 4:30 pm

Sonal Chauhan: ఓ హీరోతో ఏ హీరోయిన్ అయినా వరుసగా సినిమాలు చేస్తే ఇక ఆ హీరోయిన్‌ను పలానా హీరోకి కలిసొచ్చిందనో..మరేదో కొత్త పేరు పెట్టో పిలుచుకోవడం ఫ్యాన్స్‌కు ఈ మధ్య కాలంలో బాగా అలవాటైపోయింది. అలా సోనాల్ చౌహాన్‌ను అందరూ బాలయ్య హీరోయిన్ అని పిలుచుకుంటున్నారు. జన్నత్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో హ్యాపీడేస్ ఫేం రాహుల్ సరసన రేయిన్‌బో అనే సినిమాతో పరిచయమైంది. అయితే, ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయినా కూడా కొన్నేళ్లకి అదృష్టం అమ్మడి తలుపు తట్టి ఏకంగా బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలో అవకాశం అందుకుంది.

ఈ సినిమానే లెజెండ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనాల్ తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. గొప్ప పర్ఫార్మర్ కాకపోయినా మేకర్స్ బాలయ్యకు సెట్ అయిందని తీసుకున్నారు. అలా బాలకృష్ణతో మూడు సినిమాలు చేసింది. రూలర్, డిక్టేటర్. వీటిలో సోనాల్‌కు లెజెండ్ సినిమా మాత్రం హిట్ ఇచ్చింది. మిగతా రెండు సినిమాలు ఫ్లాప్‌గానే మిగిలాయి. అయితే, ఈమె ఒక్క బాలయ్య సినిమాలో మాత్రమే నటించిందా అంటే కాదు. రాం సరసన పండగ చేసుకో..అనుష్క నటించిన సైజ్ జీరో సినిమాలు చేసింది.

is sonal chauhan balakrishna heroine

is sonal chauhan balakrishna heroine

Sonal Chauhan : ఇదంతా ‘జై బాలయ్య’ చలువే అని చెప్పక తప్పదు.

ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ఆదిపురుష్ మూవీలో కీలక పాత్రలో కనిపించ బోతోంది. అలాగే, ప్రవీణ్ సత్తారు – కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. వాస్తవంగా ఈ సినిమాలో ముందు ఎంపికైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే ఆ అవకాశం వారూ..వీరూ అని చివరికి సోనాల్‌కు దక్కింది. మొత్తానికి టాలీవుడ్‌లో బాలయ్య హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సోనాల్‌కు మన మేకర్స్ పుణ్యమా అంటూ బాగానే నెట్టుకొస్తోంది. ఇదంతా ‘జై బాలయ్య’ చలువే అని చెప్పక తప్పదు.

vamana sai

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp