వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..? ఆ హీరో మాములు వల్లభ కాదు !!

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

 Authored By sudheer | The Telugu News | Updated on :13 January 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  శ్రీలీల తో ఆ హీరో డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో సారా అలీఖాన్, జాన్వీ కపూర్ వంటి పలువురు స్టార్ హీరోయిన్లతో కార్తీక్ పేరు వినిపించినప్పటికీ, ఇటీవల తెలుగు నటి శ్రీలీలతో ఆయన ప్రేమలో ఉన్నారనే వార్తలు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగాయి. వీరిద్దరూ కలిసి అనురాగ్ బసు సినిమాలో నటిస్తుండటంతో, షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని, వీరిద్దరూ కలిసి పబ్బులు, పార్టీలకు వెళ్తున్నారనే గాసిప్స్ బలంగా వినిపించాయి. ముఖ్యంగా కార్తీక్ తల్లికి శ్రీలీల దగ్గరవ్వడం, ఆయన ఇంట్లో జరిగిన వేడుకల్లో ఆమె పాల్గొనడం చూసి, వీరిద్దరి పెళ్లి ఖాయమని అంతా భావించారు.

Sreeleela వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..? ఆ హీరో మాములు వల్లభ కాదు !!

అయితే, శ్రీలీలతో పెళ్లి వార్తలు ఊపందుకున్న తరుణంలోనే కార్తీక్ ఆర్యన్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కేవలం 18 ఏళ్ల వయసున్న యూకే యువతి కరీనా కుబిలియుటేతో కార్తీక్ గోవాలో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారనే వార్తలు ఒక్కసారిగా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాయి. వీరిద్దరూ ఒకే హోటల్‌లో గదులు తీసుకున్నారని, ఏకాంతంగా గడిపారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్ లైన్లో ఉండగా, కార్తీక్ ఇలా మరో యువతితో కనిపించడం అభిమానులను సైతం అయోమయానికి గురిచేసింది. ఈ వార్తలు నెట్టింట వైరల్ కావడంతో కార్తీక్ ఆర్యన్ ఇమేజ్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Sreeleela రొమాంటిక్ హీరో తో శ్రీలీల డేటింగ్ ?

ఈ వ్యవహారంపై సదరు యువతి కరీనా స్పందిస్తూ, తనకు కార్తీక్ ఆర్యన్ ఎవరో కూడా తెలియదని, తాను తన కుటుంబంతో కలిసి పర్యటనలో ఉన్నానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, కార్తీక్ ఆర్యన్ వైపు నుండి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ఒకవైపు శ్రీలీలతో పెళ్లి వార్తలు, మరోవైపు విదేశీ భామతో డేటింగ్ పుకార్లు.. వెరసి కార్తీక్ ఆర్యన్ లవ్ లైఫ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది