Home » Entertainment » Is Surender Reddy Experiment Workout With Akhil Movie
Entertainment

అఖిల్ తో సురేందర్ రెడ్డి చేసే ఈ ప్రయోగం బెడిసికొడుతుందా ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: December 7, 2020, 5:45 am
Advertisement

అక్కినేని అఖిల్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు నటిస్తున్న తాజా చిత్రం మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు, వాసు వర్మ నిర్మిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ కి జంటగా నటిస్తోంది.

Advertisement

కాగా ఈ సినిమా సక్సస్ అన్నది అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా కీలకమని చెప్పాలి. వరసగా అఖిల్ నటించిన సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి.. అటు భాస్కర్ కి కూడా గత కొంతకాలంగా హిట్ అన్నది లేదు. దాంతో ఈ సినిమాని 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో రిలీజ్ చేయాలంటే కూడా మేకర్స్ ఆలోచనలో పడ్డారు. కరోనా కారణంగా పరిస్థితులన్ని తారుమారైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కి బడ్జెట్ కూడా బాగానే అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ బడ్జెట్ మొత్తం వసూలవ్వాలంటే 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో కష్టమనే అల్లు అరవింద్ సంక్రాంతి రేస్ నుంచి తప్పించించినట్టు తెలుస్తోంది.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ తో ప్రయోగం చేయబోతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి అఖిల్ తో యాక్షన్ సినిమా చేయబోతున్నట్టు ప్రచారమవుతోంది. అంతేకాదు ఈ సినిమాకోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ కానున్నాడు. ఫిట్ గా రఫ్ గా తయారవమని సురేందర్ రెడ్డి అఖిల్ కి సూచించాడని టాక్. కాగా అఖిల్ ఇంకా సక్సస్ కి దూరంగానే ఉన్నాడు. మరి సురేందర్ రెడ్డి అఖిల్ డిఫ్రెంట్ గా చూపించాలనుకుంటున్న ప్రయోగం బెడిసి కొడుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కథ ఎలాంటిదో.. అందులో అఖిల్ ని ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారో లేదో చూడాలి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి