
Tamannaah success depends on these two movies
Tamannaah : శ్రీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మొదటి సినిమా ఫ్లాపయినా నిలదొక్కుకొని ఇంతకాలం జర్నీ చేస్తుందంటే అది కేవలం శేఖర్ కమ్ముల చేతివాటమే. తమ్మూ బేబీ మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా తనలోని గ్లామర్ చూసి హ్యాపీడేస్ సినిమాలో మేయిన్ హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా భారీ హిట్ సాధించడంతో ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన రచ్చ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా తమన్నా స్టార్స్ సరసన నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇటు తెలుగు అటు తమిళం ఇండస్ట్రీలలలో సాలీడ్ హిట్స్ అందుకున్న తమన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగింది. అయితే, ఈ మధ్య తమన్నా పావులు కదిపినా అవి కుదరడం లేదు. చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. పేరుకు నాలుగైదు సినిమాలు చేతిలో ఉంటే అవి రిలీజ్ కాకుండానే ఆగిపోయాయి. ఇప్పుడు తమన్నా చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ అంటే ఒకటి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ , మరొకటి వెంకటేశ్ సరసన చేస్తున్న మల్టీస్టారర్ ఎఫ్ 3. ఇప్పటికే ఎఫ్ 2 సినిమాతో భారీ హిట్ అందుకుంది.
Tamannaah success depends on these two movies
ఆ మధ్య వచ్చిన సీటీమార్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది ఎఫ్ 3. వెంకటేశ్ వరుణ్ తేజ్ తమన్నా మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే ప్రోమో, టీజర్స్, సాంగ్స్ ప్రోమోలతో ఎఫ్ 3 సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఈ సినిమాతో వెంకీ – అనిల్ రావిపూడి తమ్మూ బేబీకి హిట్ ఇవ్వాలి. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మెహర్ రమేశ్ ఈ సినిమాకు దర్శకుడు. కీర్తి సురేశ్ ఇందులో చిరుకి చెల్లిగా నటిస్తోంది. ఈ సినిమాను తమిళంలో హిట్ సాధించిన వేదాళం చిత్రానికి రీమేక్‌గా రూపొందిస్తున్నారు. ఇక చిరుతో తమన్నా రెండవసారి జత కడుతోంది. అటు వెంకీ ఇటు చిరు తమన్నాకి హిట్స్ ఇచ్చి ఆదుకోవాల్సి ఉంది. లేదంటే ఆ తర్వాత ఈ మిల్కీ బ్యూటీ పరిస్థితేంటో చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.