వకీల్ సాబ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మేకర్ బోనీ కపూర్ సమర్పిస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ మూడేళ్ళకి వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు వకీల్ సాబ్ తో పాటు పవన్ కళ్యాణ్ వరసగా 5 ప్రాజెక్ట్స్ ని కమిటయ్యాడు. వకీల్ సాబ్ సెట్స్ మీద ఉండగానే ఇలా వరసగా సినిమాలని ప్రకటించగానే అందరూ తెగ సంబరపడ్డారు.
2021 లో మొత్తం పవన్ కళ్యాణ్ సినిమాలదే బాక్సాఫీస్ వద్ద హడావుడి అనుకున్నారు. కాని ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం బట్టి వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ మిగతా సినిమాల షెడ్యూల్స్ అన్ని డిస్టర్బ్ అయినట్టే అని చెప్పుకుంటున్నారట. వాస్తవంగా వకీల్ సాబ్ ఈ నెలలో కంప్లీట్ చేసి జనవరి నుంచి అయ్యప్పనుం కోషియం మొదలు పెట్టాలని భావించారు. అయితే వకీల్ సాబ్ కంప్లీట్ అవడానికే జనవరి మొత్తం పడుతుందని తెలుస్తోంది.
దాంతో పవన్ కళ్యాణ్ నటించబోతున్న అయ్యప్పనం కోషియం తో పాటు క్రిష్ సినిమా కూడా డిలే అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. ఇక వకీల్ సాబ్ రిలీజ్ కూడా ఏప్రిల్ లేదా మే లో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ కమిటయిన అన్ని సినిమాల మీద గట్టిగానే పడిందని 2021 లో వకీల్ సాబ్ తప్ప మిగతా సినిమాల రిలీజ్ విషయం లో ఇప్పట్లో క్లారిటీ రావడం కష్టం అన్న టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ప్లాన్ ఎలా ఉన్నాయో. ఏదేమైనా వకీల్ సాబ్ షెడ్యూల్ వల్ల మిగతా దర్శక నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో కమిటయిన ప్రాజెక్ట్ మాత్రమే డిస్ట్రబ్ కావడం కాదు మిగతా ప్రాజెక్ట్ కూడా కాస్త డిస్ట్రబ్ అవుతున్నాయని తెలుస్తోంది.
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
This website uses cookies.