
Sai dharam tej Solo Brathuke So Better telugu movie review
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రావు రమేష్, సత్య, నరేష్
దర్శకుడు : సుబ్బు
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ఎస్ థమన్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 25, 2020
థియేటర్లలో సినిమా విడుదలైంది అంటే ఇప్పుడో విచిత్రం. ఎందుకంటే.. గత మార్చిలో మూత పడిన థియేటర్లు ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఈ మధ్యలో జనాలు అసలు థియేటర్లలో సినిమాలు చూడటమే మరిచిపోయారు. మళ్లీ జనాలు.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలి అంటే కాసింత సమయం పడుతుంది. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా డేర్ చేసి థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేస్తోంది. ప్రస్తుతానికైతే.. పెద్ద సినిమా, స్టార్ హీరో సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన మొదటి సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరో. నభా నటేష్ హీరోయిన్. క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.
Sai dharam tej Solo Brathuke So Better telugu movie review
అయితే.. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది మూవీ యూనిట్. థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నా.. సినిమా టాక్ బాగుంటే జనాలు వచ్చి చూస్తారన్న ఆశతో సినిమాను రిలీజ్ చేశారు. మరి.. ప్రేక్షకులను థియేటర్లలోకి ఈసినిమా తీసుకురాగలిగిందా? లేదా? అనేది తెలుసుకుందాం రండి.
భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు తెలుసు కదా మీకు. అందులో అందరికీ ఇష్టమైనది స్వేచ్ఛా హక్కు. అంటే ఏ మనిషి అయినా తనకు నచ్చినట్టు బతకొచ్చు. అడిగేవాడు ఉండడు. ఎందుకంటే.. అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ఆ హక్కును తన హక్కుగా ఫీల్ అయిపోయి.. ఆ స్వేచ్ఛను బతికున్నప్పుడే అనుభవించాలి.. అని అనుకునే టైప్ విరాట్. ఈయన ఎవరో కాదు.. ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్. ఆ స్వేచ్ఛ జీవితాంతం ఉండాలంటే ప్రేమ, పెళ్లి జోలికి మాత్రం పోకూడదని ఫిక్సయ్యాడు మనోడు. అంతే కాదు.. విరాట్.. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి వీరాభిమాని.
అయితే.. విరాట్ ఇలా తయారవ్వడానికి పెద్ద కారణమే ఉందండోయ్. మనోడిని తన మామయ్య(రావు రమేశ్) అలా మార్చేశాడు. ప్రేమ, పెళ్లి గోల లేకుండా చేశాడు. కానీ.. మనోడి జీవితం ఒక్కసారిగా టర్న్ అవుతుంది ఎప్పుడంటే.. హీరోయిన్ తన పెళ్లిని క్యాన్సల్ చేసుకొని మరీ వచ్చి మనోడికి ఐలవ్యూ చెప్పడంతో. విరాట్ ను అమృత(నభా నటేష్) ప్రేమించడంతో.. అతడి కథ మొత్తం రివర్స్ అయిపోతుంది. అయితే.. ఈ అమృత ఎవరు? అసలు విరాట్ ను ఎక్కడ చూసింది? ఎందుకు ప్రేమించింది? విరాట్.. అమృత ప్రేమను ఒప్పుకున్నాడా? అనేదే ఈ సినిమా మిగితా స్టోరీ. అలాగే.. విరాట్ ప్రేమ, పెళ్లి అంటూ దూరంగా ఉండటానికి కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది కూడా ఈ సినిమాలో ముఖ్యమైన ఘట్టం.
ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువున్నాయి. అయినా ప్లస్ పాయింట్స్ కూడా చెప్పుకోవాలి. విరాట్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ కుమ్మేశాడు. మనోడి కామెడీ కూడా సూపర్ గా ఉంటుంది. నభా నటేష్ కూడా తన అందాలను ఒలకబోసింది. క్యూట్ గా నటించింది. ఎమోషనల్ సీన్స్ లోనూ బాగానే నటించింది. ఈ సినిమాలో మరో హైలెట్ క్యారెక్టర్ రావు రమేశ్. ఆయనతో పాటు రాజేంద్రప్రసాద్, నరేశ్ కూడా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. సాయి ధరమ్ తేజ్ డైలాగ్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ పాయింటే.
Sai dharam tej Solo Brathuke So Better telugu movie review
సినిమా సెకండాఫ్ మొత్తం రొటీన్ ఫార్మాట్ లో ఉంది. అలాగే సెకండాఫ్ లో కామెడీ డోస్ తగ్గి బోరింగ్ సీన్స్ పెరిగాయి. వెన్నెల కిషోర్ ట్రాక్ దారితప్పింది. క్లయిమాక్స్ కూడా వీక్ గా ఉండటంతో పాటు సినిమా పేరుకు తగ్గట్టుగా సోల్ మాత్రం మిస్ అయింది.
మొత్తం మీద చెప్పొచ్చేదేంటంటే.. అసలే కొత్త కరోనా వచ్చిందట మార్కెట్ లోకి. తొందరపడి థియేటర్లలోకి వెళ్తే అంతే. థియేటర్ లో సినిమా చూడక చాలా రోజులు అయింది కదా.. ఓసారి వెళ్లి వస్తాం.. అంటే మాత్రం అది మీ ఇష్టం. ఏదో ఫస్ట్ హాఫ్ లో కాసేపు నవ్వుకోవచ్చు. కాసేపు ఎమోషనల్ సీన్స్ చూసి కన్నీరు కార్చొచ్చు. అంతకుమించి ఈ సినిమాలో ఎక్స్ పెక్ట్ చేసేదేం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.