
Vakeel saab : వకీల్ సాబ్ సినిమా హంగామానే ఎక్కడ చూసినా కనిపిస్తోంది. అభిమానుల్లో.. ప్రేక్షకుల్లో.. ఇండస్ట్రీ వర్గాలలో కూడా హాట్ టాపిక్ ఇప్పుడు వకీల్ సాబ్. ఈ సినిమా వసూళ్ళ గురించి.. సినిమాలో పవర్ స్టార్ పర్‌ఫార్మెన్స్ గురించి.. ఇతర నటీ నటుల గురించి ..ఇంకా పలు అంశాల గురించే వాడి వేడిగా చర్చలు సాగుతున్నాయి. చెప్పాలంటే వకీల్ సాబ్ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన భారీ హిట్ అందుకోవడమే కాదు ఆయన అభిమానుల ఆకలి తీర్చేశాడు.
is-vakeel-saab-will-be-released-in-ott
ఇప్పటికే వకీల్ సాబ్ 100 కోట్ల క్లబ్‌లో చేరినట్టు వార్తలు మొదలయ్యాయి. రిలీజైన ఇంత తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా అంటే పవర్ స్టార్ వకీల్ సాబ్ అని చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ సినిమా కావడం..చాలా సెటిల్డ్‌గా పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ .. నివేతా థామస్, అంజలి, అనన్యల నేచురల్ పర్ఫార్మెన్స్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులను కట్టి పడేసింది. వీరు వారు అని కాకుండా ప్రతీ వర్గం ఆడియన్స్ ఈ సినిమాకి అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ముఖ్యంగా ఆడవారి కోసం ప్రత్యేకమైన షోలు వేస్తే బావుంటుందని టాక్ మొదలైంది.
ఇదిలా ఉండగా వకీల్ సాబ్ థియేటర్స్‌లో ఉండగానే.. మరికొన్ని రోజుల్లో ఓటీటీలో కూడా వచ్చేయనున్నాడని తాజా సమాచారం. ‘వకీల్‌సాబ్’ సినిమాను వచ్చే ఏప్రిల్ 23న డిజిటల్ మాధ్యమం అమెజాన్‌లో విడుదల చేయబోతున్నారట. ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కి ముప్పై కోట్ల రూపాయలను చెల్లించి డిజిటల్ హక్కులను దక్కించుకున్నారు. కానీ వకీల్ సాబ్ రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలో రాబోతుండటం డిస్ఠ్రిబ్యూటర్స్ మీద ప్రభావం చూపిస్తుందంటున్నారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన దిల్‌రాజు రెండు వారాలకే ‘వకీల్‌సాబ్’ను ఓటీటీలో విడుదల చేసేలా ఎందుకు డిసైడయ్యాడన్నది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ వకీల్ సాబ్ అప్పుడే ఓటీటీలో రాబోతుందని వస్తున్న వార్తలు అవాస్తవం అని పోస్టర్ రిలీజ్ చేసి వెల్లడించారు. అంటే వకీల్ సాబ్ ఓటీటీలో రావడం ఇప్పట్లో కాదని అర్థమవుతోంది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.