Vakeel saab : వకీల్ సాబ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vakeel saab : వకీల్ సాబ్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడా..?

 Authored By govind | The Telugu News | Updated on :13 April 2021,8:00 am

Vakeel saab : వకీల్ సాబ్ సినిమా హంగామానే ఎక్కడ చూసినా కనిపిస్తోంది. అభిమానుల్లో.. ప్రేక్షకుల్లో.. ఇండస్ట్రీ వర్గాలలో కూడా హాట్ టాపిక్ ఇప్పుడు వకీల్ సాబ్. ఈ సినిమా వసూళ్ళ గురించి.. సినిమాలో పవర్ స్టార్ పర్‌ఫార్మెన్స్ గురించి.. ఇతర నటీ నటుల గురించి ..ఇంకా పలు అంశాల గురించే వాడి వేడిగా చర్చలు సాగుతున్నాయి. చెప్పాలంటే వకీల్ సాబ్ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన భారీ హిట్ అందుకోవడమే కాదు ఆయన అభిమానుల ఆకలి తీర్చేశాడు.

is vakeel saab will be released in ott

is-vakeel-saab-will-be-released-in-ott

ఇప్పటికే వకీల్ సాబ్ 100 కోట్ల క్లబ్‌లో చేరినట్టు వార్తలు మొదలయ్యాయి. రిలీజైన ఇంత తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా అంటే పవర్ స్టార్ వకీల్ సాబ్ అని చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ సినిమా కావడం..చాలా సెటిల్డ్‌గా పవర్ స్టార్ పర్ఫార్మెన్స్ .. నివేతా థామస్, అంజలి, అనన్యల నేచురల్ పర్ఫార్మెన్స్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులను కట్టి పడేసింది. వీరు వారు అని కాకుండా ప్రతీ వర్గం ఆడియన్స్ ఈ సినిమాకి అట్రాక్ట్ అవుతున్నారు. ఇక ముఖ్యంగా ఆడవారి కోసం ప్రత్యేకమైన షోలు వేస్తే బావుంటుందని టాక్ మొదలైంది.

Vakeel saab : వకీల్‌సాబ్‌ ను దిల్‌రాజు రెండు వారాలకే  ఓటీటీలో విడుదల చేసేలా ఎందుకు డిసైడయ్యారు..?

ఇదిలా ఉండగా వకీల్ సాబ్ థియేటర్స్‌లో ఉండగానే.. మరికొన్ని రోజుల్లో ఓటీటీలో కూడా వచ్చేయనున్నాడని తాజా సమాచారం. ‘వకీల్‌సాబ్‌’ సినిమాను వచ్చే ఏప్రిల్‌ 23న డిజిటల్‌ మాధ్యమం అమెజాన్‌లో విడుదల చేయబోతున్నారట. ప్రముఖ ఓటీటీ అయిన అమెజాన్‌ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కి‌ ముప్పై కోట్ల రూపాయలను చెల్లించి డిజిటల్‌ హక్కులను దక్కించుకున్నారు. కానీ వకీల్ సాబ్ రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలో రాబోతుండటం డిస్ఠ్రిబ్యూటర్స్‌ మీద ప్రభావం చూపిస్తుందంటున్నారు. డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ అయిన దిల్‌రాజు రెండు వారాలకే ‘వకీల్‌సాబ్‌’ను ఓటీటీలో విడుదల చేసేలా ఎందుకు డిసైడయ్యాడన్నది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ వకీల్ సాబ్ అప్పుడే ఓటీటీలో రాబోతుందని వస్తున్న వార్తలు అవాస్తవం అని పోస్టర్ రిలీజ్ చేసి వెల్లడించారు. అంటే వకీల్ సాబ్ ఓటీటీలో రావడం ఇప్పట్లో కాదని అర్థమవుతోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది