Eesha Rebba : నలుపు చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈషా రెబ్బా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eesha Rebba : నలుపు చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈషా రెబ్బా!

 Authored By mallesh | The Telugu News | Updated on :29 January 2022,3:00 pm

Eesha Rebba : సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు హడావుడి చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కారణం వీరికి పెద్దగా అవకాశాలు రాకపోవడమే. నార్త్, సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే టాలీవుడ్ ఇండస్ట్రీని దశాబ్దకాలంగా ఏలుతూ వచ్చారు. అప్పట్లో సౌందర్య నుంచి నేటి రష్మిక మందన్నా, పూజా హెగ్డే ఇలా అందరూ పక్క రాష్ట్రాలకు చెందిన వారే. వీరికి ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయని అని అందరికీ అనుమానం రాక మానదు. వీరికి అందం, అభినయంతో పాటు తమ అందాలను ఆరబోయడంలో వీరు ముందున్నారు.

అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు సక్సెస్ రేటు కూడా ఉంది. కానీ తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా మాత్రం ఇంకా మెగా ఫోన్ పట్టుకోలేదు. ఈ అమ్మడు గ్లామర్ పరంగా ఓకే అనిపించుకున్నా.. అవకాశాలు మాత్రం పెద్దగా అందిపుచ్చుకోలేదు.ఈషా రెబ్బా అచ్చతెలుగు అమ్మాయి. పుట్టి పెరిగింది వరంగల్ టౌన్. మోడలింగ్ రంగం నుంచి గంపెడాశలతో సినిమా పరిశ్రమలోకి వచ్చింది. కానీ ఈ అమ్మడుకు హీరోయిన్ రోల్స్ పెద్దగా సక్సెస్‌ను తీసుకురాలేదు. ఈషా రెబ్బా టాలీవుడ్‌లో చాలా సినిమాలే చేసింది. ఇందులో కొన్ని లీడ్ రోల్ కాగా, మరికొన్ని సపోర్టింగ్ రోల్స్ ఉన్నాయి. లైఫ్ ఇస్ బ్యూటీఫుల్, అంతకుముందు ఆ తర్వాత, బంధిపోటు, ఓయ్, అమీతుమీ, దర్శకుడు, బ్రాండ్ బాబు,

isha rebba in a black sari look like angel

isha rebba in a black sari look like angel

Eesha Rebba : అవకాశాలకు దగ్గరగా దూరంగా..!

 అరవింద సమేత వీరరాఘవ, సుబ్రమణ్యపురం, సవ్యసాచి , పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతోనే కాకుండా కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈషా రెబ్బా తన లేటెస్ట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా నలుపు రంగు చీరలో మత్తెక్కిస్తోంది. కలువపూల కళ్లలతో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఈషాను బ్లాక్ సారీలో చూసి యువత ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని టాక్. పొట్టి బట్టల్లో వింతగా కనిపించే ఈషా సారీలో ఇంత అందంగా ఉంటుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది