Home » Entertainment » Jabardast Anasuya New Movie Khiladi Going To Be Game Changer To Her
Entertainment

Anasuya : అనసూయపై పెద్ద భారమే పెట్టిన ఖిలాడి.. రంగమ్మత్త మాయం కాబోతుందా!

Authored By
Himanshi
The Telugu News | Published on: January 31, 2022, 7:00 pm
Advertisement

Anasuya : టీవీ యాంకర్ గా కెరీర్‌ ను ఆరంభించిన అనసూయ అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్‌ యాంకర్ గా పేరు దక్కించుకుంది. జబర్దస్త్‌ లో సుదీర్ఘ కాలంగా యాంకర్‌ గా చేస్తున్న అనసూయ సినిమాలతో బిజీ అవుతుంది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా తో నటిగా అనసూయకు ఒక్కసారిగా స్టార్ డమ్‌ దక్కింది. రికార్డు స్థాయిలో ఆమెకు పారితోషికం కూడా దక్కుతుంది. రంగమ్మత్త పాత్ర తర్వాత అనసూయకు ఆ స్థాయిలో పాత్ర పడలేదు. పుష్ప సినిమాలో దాక్షాయణి ఆ స్థాయిలో ఉంటుందని ప్రచారం జరిగింది. కాని ఆమెకు స్క్రీన్‌ టైమ్‌ తక్కువ పడింది. దాంతో పుష్ప సినిమాలో దాక్షాయణిగా ఆమెకు దక్కింది కొంతే.

Advertisement

దాక్షాయణి ద్వారా దక్కని పేరు.. రంగమ్మత్త పేరునును మార్చే గుర్తింపును ఖిలాడి సినిమా తో అనసూయ దక్కించుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సమయంలో ఖిలాడి సినిమాలో అనసూయ పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనసూయ ద్విపాత్రాభినయం చేసిందంటూ ఖిలాడి మేకర్స్ నుండి అనధికారికంగా సమాచారం అందుతోంది. ఖిలాడి సినిమాలో ఆమె పాత్ర హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా పుల్‌ లెంగ్త్‌ లో ఉంటుందని అంటున్నారు.

jabardast anasuya new movie khiladi going to be game changer to her

Advertisement

Anasuya : జబర్దస్త్‌ ను మించబోతున్న ఖిలాడి

జబర్దస్త్‌ ద్వారా అనసూయకు స్టార్‌ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు దక్కింది. ఇప్పుడు అంతకు మించిన స్టార్‌ డమ్‌ ఖిలాడి సినిమా తో వస్తుందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు. ఖిలాడి సినిమాలో అనసూయ పాత్ర గతంలో ఎప్పుడు లేని విధంగా ఉంటుందని అంటున్నారు. రవితేజ కు మాత్రమే కాకుండా అనసూయకు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది. ఇక మీదట అనసూయను ప్రేక్షకులు చూసే తీరు.. ఆమె గురించి ఆలోచించే తీరు మారిపోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఖిలాడి అనసూయ కు రంగమ్మత్త ఇమేజ్ ను చెరిపేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది చూడాలి.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి