Rocking Rakesh : కేసీఆర్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ రాకేష్ .. ఇల్లు, కారు అమ్మేశా అంటూ ఎమోషనల్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rocking Rakesh : కేసీఆర్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ రాకేష్ .. ఇల్లు, కారు అమ్మేశా అంటూ ఎమోషనల్…!

Rocking Rakesh : బుల్లితెర మోస్ట్ పాపులారిటీ షో అయిన జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు రాకింగ్ రాకేష్. తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను బెస్ట్ కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. ఇక జబర్దస్త్ లో చేసిన చాలామంది కమెడియన్ లు ఇప్పుడు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు జబర్దస్త్ కమెడియన్లు వెండి తెరపై సెటిల్ అయ్యారు కూడా. ఈ క్రమంలోనే రాకేష్ కూడా ఓ సినిమా […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 October 2023,10:00 pm

ప్రధానాంశాలు:

  •  కేసీఆర్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ రాకేష్ ..

  •  ఇల్లు, కారు అమ్మేశా అంటూ ఎమోషనల్ .. జబర్దస్త్ రాకింగ్ రాకేష్

Rocking Rakesh : బుల్లితెర మోస్ట్ పాపులారిటీ షో అయిన జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు రాకింగ్ రాకేష్. తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను బెస్ట్ కమెడియన్ గా ఆకట్టుకున్నాడు. ఇక జబర్దస్త్ లో చేసిన చాలామంది కమెడియన్ లు ఇప్పుడు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు జబర్దస్త్ కమెడియన్లు వెండి తెరపై సెటిల్ అయ్యారు కూడా. ఈ క్రమంలోనే రాకేష్ కూడా ఓ సినిమా రూపొందిస్తూ అందులో హీరోగా నటిస్తున్నాడు. తనే హీరోగా నిర్మిస్తూ కేసీఆర్ పేరు మీద సినిమా తీస్తున్నారు. రీసెంట్ గా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా లాంచ్ గ్రాండ్గా జరిగింది.

తెలంగాణ ప్రాంతంలోని బంజారాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై స్పందించిన రాకింగ్ రాకేష్ తాను నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. హీరో హీరోయిన్ల కి ఫ్యాన్స్ ఉన్నప్పుడు కేసీఆర్ కి ఎందుకు ఫ్యాన్స్ ఉండకూడదు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. అందుకే ఆయన పేరుతో సినిమా తీస్తున్నా అని రాకింగ్ రాకేష్ చెప్పాడు. తాను బినామీ డబ్బులతో ఈ సినిమా నిర్మిస్తున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా కోసం మా అమ్మకు ఎంతో ఇష్టమైన, నేను కట్టించిన ఇల్లు తాకట్టు పెట్టా. నా కారు కూడా అమ్ముకున్నా. ఇంటికి సంబంధించిన పేపర్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు.

అంతకుముందు కేసీఆర్ సినిమా చేస్తామని కొందరు వ్యక్తులు మాట ఇచ్చి సడన్గా హ్యాండ్ ఇచ్చారు అని రాకింగ్ రాకేష్ తెలిపాడు. ఈ కారణంగానే తాను నిర్మాతగా మారాల్సి వచ్చింది అని చెప్పాడు. ఓ ప్రముఖ రచయిత మోసం చేయడం వల్లే సినిమా మొదలవ్వడానికి ముందే కారు అమ్ముకున్నాను. ఈ విషయంలో మా అమ్మతోపాటు నా భార్య సుజాత కూడా నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తున్నారు. సుజాత లాంటి భార్య దొరకటం నా అదృష్టం అంటూ రాకింగ్ రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. ఏది ఏమైనా జబర్దస్త్ షో ద్వారా చాలామంది కమెడియన్స్ కి మంచి లైఫ్ దొరికింది అని చెప్పాలి. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ వెండితెరపై సెటిల్ అయ్యారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది