Home » Entertainment » Jabardasth Anchor Anasuya Career Down Coming Days
Entertainment

Anasuya : పాపం.. అనసూయ అనవసర రాద్దాంతంతో పీకల్లోతు కష్టాలు

Authored By
aruna
The Telugu News | Published on: September 10, 2022, 2:30 pm
Advertisement

Anasuya : జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ కెరియర్ కష్టాల్లో నెట్టివేయబడిందని బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతుంది. మల్లెమాల ఈటీవీ నుండి దూరం అయిన అనసూయ స్టార్ మా లో వరుసగా కార్యక్రమాలను చేయబోతున్నట్లుగా ఆమె అభిమానులు భావించారు. కానీ ఇప్పటి వరకు ఆమె స్టార్ మా కార్యక్రమాలు రావడం లేదు. అసలు ఇప్పట్లో ఆమె స్టార్ మా కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో కూడా తెలియదు.

Advertisement

పైగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు మరింతగా రచ్చ చేస్తున్నాయి. దాంతో ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న మంచి పేరు మరియు ప్రతిష్ట సన్నగిల్లాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఈమె సినిమాల్లో మరియు బుల్లి తెరపై గతంలో మాదిరిగా బిజీగా ఉండే అవకాశం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అనసూయ ప్రస్తుతానికి కాస్త కాళీ ఉన్న భవిష్యత్తులో మళ్లీ పుంజుకుంటుందని.. ఆమె జబర్దస్త్ స్థాయిలో మళ్లీ స్టార్ మా ఛానల్ కి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటుందని అభిమానులు కొందరు ఆశాభావంతో ఉన్నారు.

jabardasth anchor anasuya career down coming days

Advertisement

అనసూయ లేని పోని హడావుడి రాద్ధాంతాలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకోవడం ఆమె స్వయంకృతాపరాధం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమెను సమర్థిస్తున్నారు. మొదటి నుండి అనసూయ చాలా మొండి వైఖరితో ముందడుగు వేస్తూ ఉంటుంది. అందుకే ట్విట్టర్లో తనను విమర్శించిన వారికి ఎప్పటికప్పుడు గట్టి సమాధానాలను ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఆ కారణాల వల్ల కూడా ఈమెకు సినిమాల్లో కాస్త ఆఫర్లు తగ్గుతున్నాయేమో అనిపిస్తుంది. త్వరలోనే ఈమె మళ్లీ పుంజుకుంటుందో చూడాలి. ఒక వేళ పరిస్థితి ఇదే కంటిన్యూ అయితే కెరియర్ డౌన్ ఫాల్ మొదలైనట్టే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి