Jabardasth – Sridevi Drama Company : జబర్దస్త్ – శ్రీదేవి డ్రామా కంపెనీ విషయం లో ఊహించని బ్రేకింగ్ న్యూస్..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 January 2023,12:20 pm

Jabardasth – Sridevi Drama Company : బుల్లితెరపై జబర్దస్త్ షో ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా జనాలను నవ్విస్తూ అత్యధిక టిఆర్పి రేటింగ్స్ తో దూసుకెళుతోంది. ఈ షోను నిర్వహిస్తున్న మల్లెమాల టీమ్ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షోలే కాకుండా పండగలకి ఈవెంట్లు చేస్తూ జనాలను అలరిస్తుంటుంది. అయితే తాజాగా మల్లెమాలవారు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకి కొత్త జడ్జ్ ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే గత కొద్ది కాలంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో

సీనియర్ నటి యమున ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యమునను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతకుముందు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకి రోజా ద్వారా పాపులారిటీ వచ్చింది. అయితే రోజా ప్లేస్ లోకి యమున వస్తే జబర్దస్త్ షోకి అంత పాపులారిటీ వస్తుందా అని జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీనియర్ నటి యమునా ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సీరియల్ లో నటిస్తుంది. ఇటీవల కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో కూడా నిలిచింది.

Jabardasth and Sridevi Drama Company show new lady judge

Jabardasth and Sridevi Drama Company show new lady judge

ప్రస్తుతం ఆమె సీరియల్స్, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రావడానికి కష్టపడుతుంది యమునా. ఈ క్రమంలో ఆమెకు మల్లెమాల నుంచి ఆఫర్ రావడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో చాలామంది ఇంద్రజ, రోజాల కంటే యమునా రేంజ్ పెరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల జబర్దస్త్ లో మార్పులు చేర్పులు జరిగాయి. కొత్తగా జడ్జిలు ఎంతోమంది వచ్చారు వెళ్లిపోయారు. ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిలుగా ఇంద్రజ, కృష్ణ భగవాన్లు ఉన్నారు.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి