Home » Entertainment » Jabardasth Avinash Tortured Anchor Suma In Star Maa Bonalu Event
Entertainment

jabardasth Avinash : సుమకే చుక్కలు చూపించాడుగా.. అవినాష్ దెబ్బకు తల పట్టేసుకుందిగా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 17, 2022, 9:00 pm
Advertisement

స్టార్ మా ఈవెంట్లు, షోలు అంటే కచ్చితంగా అవినాష్ కనిపించాల్సిందే. అవినాష్ లేకుండా ఒక్క షో కూడా జరగదు. అవినాష్ ఏదైనా బిజీగా ఉండి రాలేకపోతాడేమో గానీ.. అతను లేకుండా ఏ షో కూడా జరగదు. ఒక్కోసారి ఈవెంట్ మొత్తంలో అవినాష్ ఆధిపత్యమే కనిపిస్తుంటుంది. అవినాష్ చేసే కామెడీ ఒక్కోసారి బాగానే ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో అవినాష్ చేసే కామెడీ అతిలా అనిపిస్తుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన స్టార్ మా బోనాలు ఈవెంట్‌లో అవినాష్ దుమ్ములేపేశాడు. అయితే అవినాష్ ఆన్ స్క్రీన్‌లో కంటే ఆఫ్ స్క్రీన్‌లో మరింత రచ్చ చేశాడు. ఈ వీడియోను సుమ షేర్ చేసింది.

Advertisement

సుమ మామూలుగా తన యూట్యూబ్ చానెల్‌ను ప్రమోట్ చేసుుకునేందుకు బాగానే కష్టపడుతోంది. అందుకే బిహెండ్ సీన్స్ అంటూ ఈ ఈవెంట్ బ్యాక్‌లో ఎలా జరిగిందో ఓ వీడియోను వదిలింది. ఈ ఈవెంట్ కోసం ఎలా రెడీ అయిందో చూపించింది. ఎలా మేకప్ వేసుకుందో వివరించింది. అయితే ఈ సెట్‌లో అందరూ చేసిన అల్లరి గురించి చెప్పింది. అందరినీ చూపించింది. ఇది తన యూట్యూబ్ చానెల్ కోసం చేస్తున్నానని అందరికీ చెప్పింది. దీంతో అవినాష్ మరింత రెచ్చిపోయాడు. అవినాష్ ఈ వీడియోలోకి వచ్చి..ముక్కు అవినాష్ యూట్యూబ్ చానెల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాడు.

jabardasth Avinash Tortured Anchor Suma in Star Maa Bonalu Event

Advertisement

దీంతో సుమ తలపట్టేసుకుంది. అలా ఒకసారి రెండు సార్లు కాదు.. మూడు నాలుగు సార్లు కెమెరా ముందుకు వచ్చి.. తన యూట్యూబ్ చానెల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోమని అన్నాడు. అంత దగ్గరగా వెళ్లకు నిన్ను చూసి అందరూ భయపడతారు అని సుమ కౌంటర్లు వేసింది. ఇక్కడున్న వాళ్లందరికీ ఒక్కో చానెల్ ఉంది..అందరివీ సబ్ స్క్రైబ్ చేయండి అని సుమ చివరకు కోరింది. అలా మొత్తానికి అవినాష్ అల్లరికి సుమకు పిచ్చెక్కిపోయినట్టు అనిపించింది. సుమ చేసిన ఈ వీడియో యూట్యూబ్‌లో బాగానే ట్రెండ్ అవుతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి