Jabardasth : ఇక్కడ ఏం చేయడం లేదు అక్కడైనా చేయండి!.. సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీనుల పరువుపాయె

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 13, 2021, 6:40 pm

Jabardasth : సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్.. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. వాళ్ల మధ్య మంచి కో ఆర్డినేషన్ ఉంటుంది. ముగ్గురు కలిసి త్రీ మంకీస్ అనే సినిమా కూడా తీశారు. ఆన్ స్క్రీన్‌‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీళ్ల సందడి మాములుగా ఉండదు. ముగ్గురు ట్యాలెంట్ కలిగిన కమెడీయన్లే అయినప్పటికీ.. ఒకటిగానే కలిసి స్కిట్స్ చేస్తున్నారు. కొన్ని రోజులు శ్రీను పేరిటి వేరే టీమ్ నడిచిన.. తిరిగి ముగ్గురు ఒకే టీమ్‌లో కొనసాగుతున్నారు.

వీరు ముగ్గురు స్టేజ్ మీదకు వచ్చారంటే.. స్క్రిప్ట్ లేకున్నా తమదైన శైలిలో నవ్వులు పూయిస్తారు. ముఖ్యంగా శ్రీను, రామ్ ప్రసాద్‌లు.. స్కిట్స్‌లో సుధీర్‌ను ఓ ఆటో ఆడకుంటారు. వాళ్లిద్దరు వేసే పంచులను సుధీర్ కూడా వారి పంచులను లైట్ తీసుకుంటాడు. అయితే రీసెంట్‌గా ఓ స్కిట్‌లో బాబు.. ఈ ముగ్గురి పరువు తీసేశాడు. తాజా స్కిట్‌లో శ్రీను, రామ్ ప్రసాద్, సుధీర్ ముగ్గురు మూడు షాప్స్ పెట్టుకుంటారు.

Jabardasth Babu Setteries on sudheer getup srinu and ramprasad

Jabardasth Babu Setteries on sudheer getup srinu and ramprasad

Jabardasth : ముగ్గురి పరువుతీసిన బాబు..

వారి వద్దకు వచ్చిన బాబు.. ఒక్కో షాప్ వద్దకు వచ్చి పంచ్‌లు వేస్తుంటాడు. శ్రీను, రామ్ ప్రసాద్‌లు కూడా బాబుపై పంచ్‌ల వర్షం కురిపిస్తారు. అయితే ఈ క్రమంలోనే బాబు.. అనవసరంగా వచ్చా మీ షాపులకు అని అంటాడు. అప్పుడు సుధీర్.. మా ముగ్గురి గురించి తెలుసా..? అని అంటాడు. అప్పుడు బాబు.. మీ గురించి నాకేందుకు తెలియదు.. వాడేమో(శ్రీను) రాజు యాదవ్ అంటాడు, నువ్వేమో(సుధీర్) గాలోడు అంటావ్.. వీడిమో(రామ్ ప్రసాద్) బీప్ షో అంటాడు. ఇక్కడ ఎలాగో బాగా చేయడం లేదు.. కనీసం అదైనా బాగా చేయండిరా చుద్దాం అంటూ కౌంటర్ వేస్తాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp