Sudigali Sudheer : జబర్దస్త్ ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సుడిగాలి సుదీర్ కి ఎంతటి క్రేజీ ఉందో ఆయన టీం లోని ప్రతి ఒక్కరికి అదే స్థాయి క్రేజ్ ని తెచ్చి పెట్టాడు అనడంలో సందేహం లేదు. సుడిగాలి సుదీర్ టీం లో గెటప్ శ్రీను మరియు రాంప్రసాద్ లకు మంచి ఇమేజ్ దక్కింది. వారి ఇద్దరితో పాటు పెద్దగా సందడి చేయకున్నా కూడా వారి టీం అవ్వడం వల్ల సన్నీకి కూడా ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కింది. సుడిగాలి సుదీర్ ఉన్న సమయంలో సన్నీకి మంచి స్కోప్ ని స్కిట్స్ లో ఇచ్చేవారు, కానీ సుడిగాలి సుదీర్ జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన తర్వాత సన్నీ పరిస్థితి దారుణంగా మారింది అంటూ ఈటీవీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను లు సన్నీని డామినేట్ చేస్తున్నారని చర్చ జరుగుతుంది. గతంలో సన్నీకి రెండు మూడు డైలాగ్స్ అయినా ఉండేది.. కానీ ఇప్పుడు కేవలం సైడ్ కి నిలబడి చూసే రోల్ మాత్రమే ఉంటుంది. పైగా గతంలో సూడిగాలి సుదీర్ ఇచ్చినంత పేమెంట్ కూడా రాంప్రసాద్, గెటప్ శ్రీను లు సన్నీకి ఇవ్వడం లేదని సమాచారం అందుతుంది. మొత్తానికి సుడిగాలి సుదీర్ ఈటీవీ నుంచి వెళ్లి పోవడంతో సన్నీకి కష్టాలు తప్పడం లేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. సన్నీ కేవలం జబర్దస్త్ లో మాత్రమే కనిపిస్తూ ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో సుడిగాలి సుదీర్ వెళ్లి పోవడంతో ఆర్థిక పరమైన కష్టాలు ఇబ్బందుల కారణంగా మెల్ల మెల్లగా సినిమాల్లో నటిస్తూ ఇతర కార్యక్రమాల్లో కూడా కనిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు.
డైలాగ్ ఇచ్చిన సమయంలో సన్నీ వెంటనే చెప్పలేక పోతున్నాడని.. అతడిని చాలా మంది అవమానిస్తూ ఉంటారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా సన్నీకి ఈ మధ్య కాలంలో ఛాన్స్ దక్కుతుంది. ఎన్ని ఛాన్సులు వచ్చినా కూడా గతంలో మాదిరిగా సన్నీకి ప్రోత్సాహం లేదని ఈటీవీ వర్గాల వారు మరియు ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. సుడిగాలి సుదీర్ తో పాటు సన్నీ కూడా స్టార్ మా కి వెళ్లి ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. కొందరు మాత్రం సన్నీ వంటి వారు జబర్దస్త్ ఈటీవీలో కంటిన్యూ అవ్వడమే మంచిదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.