Home » Entertainment » Jabardasth Comedy Show Annapurnamma Role And Trolls
Entertainment

Jabardasth Annapurnamma : జబర్దస్త్‌ లో అన్నపూర్ణమ్మ.. డబ్బులు వస్తున్నాయి కానీ పరువు పోతుంది..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 10, 2022, 1:00 pm
Advertisement

Jabardasth Annapurnamma : ఈ మధ్య కాలంలో జబర్దస్త్‌ లో రెగ్యులర్ గా సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ కనిపిస్తున్నారు. ఒకటి రెండు సార్లు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆమెను గెస్ట్‌ గా తీసుకు వచ్చారు. ఆ తర్వాత ఆమె ను జబర్దస్త్‌ లో ఆది సరదాగా ఒకటి రెండు ఎపిసోడ్స్ లో చూపించాడు. ఇప్పుడు ఆమె గెటప్ శ్రీను ఆటో రామ్‌ ప్రసాద్ టీమ్‌ లో ఫుల్‌ టైమ్‌ కమెడియన్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆమె కు మంచి రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమె ఉన్న స్కిట్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి. అంతే కాకుండా ఆమె యొక్క నటనకు అభిమానులు అయిన వారు కూడా ఉన్నారు.

Advertisement

ఇదే సమయంలో అన్నపూర్ణమ్మ విషయంలో జబర్దస్త్‌ వారిని విమర్శించే వారు కూడా ఉన్నారు. మల్లెమాల వారు అన్నపూర్ణమ్మకు అందరితో పాటు కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇవ్వడంతో పాటు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారట. కానీ స్కిట్స్ లో మాత్రం ఆమె సీనియారిటీని కూడా లెక్క పెట్టకుండా మరీ చీప్ కామెడీ పంచ్ డైలాగ్స్ ఆమెపై వేస్తున్నారు. ఆమె యొక్క స్థాయిని తగ్గించే విధంగా చాలా మంది ఆమెను కామెంట్స్ చేస్తూ కామెడీ చేస్తున్నారు. రామ్‌ ప్రసాద్‌ మరియు గెటప్ శ్రీను లు మాత్రమే కాకుండా అందరు కూడా ఆమెను అవమానిస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.

jabardasth comedy show annapurnamma role and trolls

Advertisement

సోషల్‌ మీడియాలో కొందరు అన్నపూర్ణమ్మకు మద్దతుగా ప్రచారం మొదలు పెట్టారు. మరీ ఇలాంటి చిల్లర డైలాగ్స్ తో ఆమె యొక్క స్థాయిని తగ్గిస్తున్నారు. బుద్ది లేని కామెడీ షో కు ఆమె అవసరమా అన్నట్లుగా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అన్నపూర్ణమ్మ ఇప్పుడు ఎందుకు ఇలా జబర్దస్త్‌ లో చేయాల్సి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్‌ ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఆమె పరువు పోతుంది అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి