జబర్దస్త్ షోలో ఇప్పుడు అంతా కూడా ఇంద్రజ మయమే. రోజా వెళ్లిపోయింది.. కొంతలో కొంత సీనియర్ మనో. ఆయన కూడా ఓ గెస్టు మాదిరే. కానీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనో కనిపించడు. తన షూటింగ్‌లను చూసుకుంటూ ఇటు వస్తుంటాడు. కానీ ఇంద్రజకు మాత్రం ఇప్పుడు వేరే పనేమీ లేదు. బుల్లితెర మీదే ఇంద్రజ పూర్తిగా ఫోకస్ పెట్టేసింది. ఇక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా షో ఏదైనా కూడా ఇంద్రజ పేరే వినిపిస్తోంది. ఆమె మొహమే కనిపిస్తుంది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ఇంద్రజ, పూర్ణలు కనిపించారు.మనో స్థానంలో పూర్ణ వచ్చింది.
అయితే ఏ షోలో అయినా సరే వర్ష మీద వచ్చే కామెంట్లు, సెటైర్లు, జోకులు మాత్రం కామన్. అయితే వర్షను అందరూ కూడా లేడీ గెటప్ అని అంటుంటారు. ఆ డైలాగులు అందరికీ కామన్ కూడా అయ్యాయి. అయితే ఆ మధ్య వర్ష కాస్త సీరియస్ అయింది. అయితే అది నిజంగా సీరియస్ అయిందా? లేదా టీఆర్పీ కోసం డైరెక్షన్ టీం చేసిన ప్లానా? అన్నది తెలియడం లేదు. మగాడు మగాడు అని పదే పదే ఎందుకు అంటారని వర్ష స్టేజ్ మీదే కన్నీరు పెట్టేసింది.నానా హంగామా చేసింది.. చివరకు ఇమాన్యుయేల్ సారీ చెప్పే వరకు తీసుకొచ్చింది. మొత్తానికి అదంతా డ్రామా అని జనాలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కూడా అలాంటి ఓ పంచ్ వేసేందుకు ఇమాన్యుయేల్ రెడీ అయ్యాడు.
కానీ అంతలోపే గతం గుర్తుకు వచ్చినట్టుంది. పైగా ఇంద్రజ కూడా అలాంటి కామెంట్లు చేయొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. అందరూ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు అని ఇమాన్యుయేల్‌ను వర్ష అడుగుతుంది స్కిట్‌లో. ఏం చెప్పాలో అర్థం కాక.. నువ్ నేపాలీలా ఉంటావ్ కదా? అందుకే చూస్తున్నారని అంటాడు.అయితే ఆ తరువాత ఇమాన్యుయేల్‌ను పట్టుకుని ఆడోడా? అని ఫైమా రెచ్చిపోతోంది. ఆ సమయంలో ఇంద్రజ తెగ నవ్వేస్తుంది. ఆడదాన్ని మగాడిలా ఉన్నావ్ అనొద్దని అన్నారు.. కానీ ఇప్పుడు మగాడిని ఆడోడా? అంటూ మీరు నవ్వుతున్నారా? అని ఇంద్రజను స్టేజ్ మీద నుంచే ఇమాన్యుయేల్ ప్రశ్నించాడు.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.