
Sarkaru vaari paata How many crores is the loss in the long run
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా మహానటి కీర్తి సురేష్ కి కలిసి రాలేదా..? అంటే ప్రస్తుతం అవుననే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. నిజంగానే అమ్మడి ఫేట్ బాలేదా ఏమో తెలీదు గానీ కీర్తి నటించిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతోంది. మహానటి సినిమా తర్వాత మళ్ళీ కీర్తి ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. అంతేకాదు, తనని కూడా ఐరెన్ లెగ్ అంటూ కామెంట్ చేశారని మొన్నా మధ్య స్వయంగా కీర్తి చెప్పుకొచ్చింది. అయితే, తాజాగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది.
కీర్తి సురేశ్ మాత్రమే కాదు..చిత్రబృందం అంతా ఈ మూవీ భారీ హిట్ సాధిస్తుందని ప్రమోషన్స్‌లో ఎంతో నమ్మకంగా చెప్పుకొచ్చారు. కానీ, ఈగురువారం(మే 12) ఇండియాతో పాటుగా అమెరికా వంటి దేశాలలో కూడా రిలీజైన సర్కారు వారి పాట చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. గతంలో వచ్చినకొన్ని ఫ్లాప్ సినిమాల కథలను సర్కారు వారి పాట చిత్రంతో పోల్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ చాలాకాలం తర్వాత కథలేని సినిమాలోనటించారని..సినిమా మొత్తం ఆయన భుజాల మీదే మోసారని ఫ్యాన్స్ చెప్పుకున్నారు.
Mahesh Babu movie also did not come with Kirti Suresh
దర్శకుడు ఎంచుకున్న మేయిన్ పాయింట్ మంచిదే అయినా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడని..హీరో, హీరోయిన్ పాత్రలుమాత్రమే కాకుండా మిగతా పాత్రలు అంత బలంగా లేవని డిసైడ్ చేశారు. ముఖ్యంగా కీర్తి సురేశ్ అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుందని..ఎదో కొన్ని చోట్ల
లుక్స్ పరంగా ఆకట్టుకున్న ఆమె పాత్రకు అసలు ఇంపార్టెన్స్ లేదని మాట్లాడుకుంటున్నారు. దాంతో కీర్తికి మహేశ్ బాబు సినిమాతో కూడా హిట్ దక్కనట్టేఅని ప్రచారం జరుగుతోంది. ఆమె ఏ హీరోతో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అని కూడా డిసైడ్ చేస్తున్నారు. మరి లాంగ్ రన్ లేదా కనీసం ఈ వారం ఆగితేనైనా
సర్కారు వారి పాట సరైన రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. అప్పటికి వరకు కీర్తి ఫేట్ గురించి ఏమీ డిసైడ్ చేయలేము.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.