Jabardasth Faima : జబర్దస్త్ ఫైమా, ప్రవీణ్ ఆన్ స్క్రీన్ లవ్ బ్రేకప్.. అసలు విషయం ఇదేనా!
Jabardasth Faima : జబర్దస్త్ లో ఎన్నో ప్రేమ కథలు పుట్టాయి. సుధీర్ మరియు రష్మీ మొదలుకుని ఎంతో మంది ప్రేమించుకుంటున్నాం అంటూ ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిది కూడా ఫేక్ అనే విషయం ప్రేక్షకులకు మెల్ల మెల్లగా అర్థం అయ్యింది. జబర్దస్త్ కార్యక్రమంలో ఇమాన్యూల్ మరియు వర్షల తర్వాత అంతగా ఫేమస్ అయిన వారు ఫైమా మరియు ప్రవీణ్ లు. వీరిద్దరు కూడా ప్రేమించుకుంటున్నట్లుగా పలు స్టేజీల మీద చెప్పుకొచ్చారు.
పలు కార్యక్రమాల్లో ఫైమా ను ప్రేమిస్తున్నాను.. అవకాశం ఇస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఫైమా కూడా నవ్వుతూ ఉండేది. దాంతో అతడి ప్రేమ నిజం.. అతడి ప్రేమను ఆమె ఒప్పుకోవడం కూడా నిజం అంటూ అంతా భావించారు. కాని అనూహ్యంగా వీరిద్దరి మద్య ఈమద్య ప్రేమ వ్యవహారం కట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇటీవల ఒక ఎపిసోడ్ లో ప్రవీణ్ ప్రేమ విఫలం అయినట్లుగా అర్థం వచ్చేలా డైలాగ్ చెప్పాడు.ప్రేమ పేరుతో మూడు సంవత్సరాలుగా ఆమె వెంట తిరిగితే చివరకు ఆమె వదిలేసింది అంటూ డైలాగ్ చెప్పాడు.

Jabardasth Faima and praveen love breakup story
ఆ డైలాగ్ ఖచ్చితంగా ఫైమా కు తగిలేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కూడా చాలా రోజులుగా ఒకే స్కిట్ లో కనిపించక పోవడం.. ఒకే సారి కనిపించక పోవడం చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా గతంలో వీరిద్దరి వీడియో లు తెగ వచ్చేవి. కాని ఇప్పుడు వీడియో లు లేవు కదా కనీసం వారిద్దరి మాట ముచ్చట కూడా లేదు. దాంతో ఖచ్చితంగా వీరిద్దరు విడి పోయి ఉంటారు అంటున్నారు. ఫైమా మరియు ప్రవీణ్ మతాలు వేరు కనుక వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకుని ఉండరు. నిజంగా ప్రేమించుకున్న వీరిద్దరు పెద్దల మాటకు కట్టుబడి ప్రేమను త్యాగం చేసి ఉంటారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.