Jabardasth Kiraak RP : కిరాక్ ఆర్పీ నిజస్వరూపం ఇదా? జబర్దస్త్ ఏడుకొండలు మొత్తం చెప్పేశాడు.. అందుకే సినిమా ఆగిపోయిందా?
Jabardasth Kiraak RP : జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్ గురించి గత కొన్ని రోజుల నుంచి చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కామెడీ కన్నా.. జబర్దస్త్ షోలో జరిగే విషయాల గురించే నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. జబర్దస్త్ అనే కామెడీ షో ఈటీవీలో ప్రసారం అవుతున్నా.. దాన్ని నిర్మించే సంస్థ మల్లెమాల. మల్లెమాల ఓనర్ శ్యాంప్రసాద్ రెడ్డి. అయితే.. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఉండి చాలా ఫేమ్ సంపాదించిన కిరాక్ ఆర్పీ ఇటీవల మల్లెమాల సంస్థ, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. అవన్నీ అబద్ధాలంటూ కొందరు జబర్దస్త్ ను సమర్థిస్తూ ఆర్పీపై విరుచుకుపడ్డారు.
తాజాగా ఆ జాబితాలో జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు కూడా చేరాడు. ఏడుకొండలుకు ఒకప్పుడు మల్లెమాలలో మామూలు క్రేజ్ ఉండేది కాదు. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కూడా ఏడుకొండలుపై అప్పట్లో చాలా కామెంట్లు చేసేవారు. ఆయనపై పంచ్ లు వేసేవాళ్లు. కానీ.. అవన్నీ ఆయన చాలా లైట్ తీసుకునేవారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఏడుకొండలు.. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాడు. యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఏడుకొండలు.. ఆర్పీ నిజస్వరూపాన్ని తెలియజేశాడు. శ్యాంప్రసాద్ రెడ్డికి జబర్దస్త్ తల్లి లాంటిది. దానిపై ఆర్పీ చెడుగా మాట్లాడాడు. నేను జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేశాక.. చాలా సినిమాలకు మేనేజర్ గా పనిచేశా. ఓసారి ఓ సినిమా డబ్బింగ్ కోసం ఆర్పీ ఆఫీసు ఉన్న ఏరియాకు వెళ్లా. అక్కడ ఆర్పీ నన్ను చూశాడు. తన ఆఫీసుకు తీసుకెళ్లాడు.

jabardasth former manager yedukondalu comments on kiraak rp
Jabardasth Kiraak RP : తన సినిమాకు నన్ను మేనేజర్ గా ఉండమన్నాడు.. 50 వేలు ఇస్తా అన్నాడు
తన సినిమాకు మేనేజర్ గా ఉండమన్నాడు. జీతం కూడా నెలకు 30 వేలు ఇస్తా అన్నాడు. కానీ.. నేను 50 వేలు అయితే చేస్తా అన్నా. దీంతో 50 వేలు ఇవ్వడానికి రెడీ అన్నాడు. ఒక నెల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. దీంతో ఆఫీసుకు వెళ్లడం స్టార్ట్ చేశా. ఆఫీసుకు వెళ్లాకే.. ఆర్పీ ఎంత ఫ్రాడ్ చేస్తున్నాడో అర్థం అయింది. అసలు సినిమాలో ఎవరు నటిస్తున్నారు అని అడిగితే ఏదో సమాధానం చెప్పేవాడు. బుకాయించేవాడు. ప్రభాస్ కజిన్ అంటూ చెప్పేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాడీ హెవీగా ఉందని.. అది తగ్గిన తర్వాత మన సినిమా మొదలు అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిన్ని చరణ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చామని చెప్పాడు. ఆ తర్వాత ఓ సినిమాటోగ్రఫర్ కు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్టు చెప్పాడు. ఆ సినిమా నిర్మాతను అడిగితే.. అది అబద్ధం అని తేలింది. ఇలా.. సినిమా కోసం చాలా ఫ్రాడ్ చేశాడు. సినిమా విషయంలో పూర్తిగా ఆర్పీదే తప్పు.. అని ఇంటర్వ్యూలో ఏడుకొండలు చెప్పుకొచ్చాడు.
