Jabardasth Kiraak RP : కిర్రాక్ ఆర్పి చేపల పులుసు సెంటర్ క్లోజ్ చేస్తే ఎంత నష్టం వచ్చిందో తెలుసా..?
Jabardasth Kiraak RP : ఈటీవీ లో జబర్దస్త్ కామెడీ షోతో ఎంటర్టైన్మెంట్ రంగంలో కిర్రాక్ ఆర్పి మంచి ఇమేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. ఆ షోలో రకరకాల వేషాలు వేస్తూ వీక్షకులను ఎంతగానో నవ్వించేవాడు. అయితే ఇదే షో నుండి బయటకు వచ్చాక… “జబర్దస్త్” యాజమాన్యంపై కిర్రాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. సరైన భోజనం పెట్టేవారు కాదని… కొంతమంది జబర్దస్త్ కంటెస్టెంట్స్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత వేరే ఛానల్ లో మెగా బ్రదర్ నాగబాబు ఆధ్వర్యంలో కిర్రాక్ ఆర్పి రాణించడం జరిగింది.
అదేశోకి సుడిగాలి సుదీర్, గెటప్ శీను వంటి వారు కూడా వచ్చేశారు. తర్వాత పరిస్థితులు మొత్తం తారుమారు కావడంతో ఇప్పుడు “నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు” అంటూ తన సొంతూరు పై కిర్రాక్ ఆర్పి బిజినెస్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో కిర్రాక్ ఆర్పి చేపల పులుసు సెంటర్ అతి తక్కువ కాలం లోనే చాలా ఫేమస్ అయ్యింది. ఏకంగా తండోపతండాలుగా రావటంతో… ట్రాఫిక్ జామ్ కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో కొద్ది నెలలకే చాపల పులుసు సెంటర్ ఆర్పి క్లోజ్ చేసేసాడు.
దీంతో ఆ సమయంలో అనేక విమర్శలు వచ్చాయి. కానీ ఆర్పి మాత్రం వచ్చే కస్టమర్లకు ఏదో వ్యాపారం చేసాము కదా అన్న తరహాలో కాకుండా మంచి క్వాలిటీ ఇవ్వడానికి కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్లు ఇటీవల రీ ఓపెన్ చేసాక స్పష్టం చేశారు. అయితే చేపల సెంటర్ క్లోజ్ చేసిన సమయంలో కొన్ని లక్షల బిజినెస్ నష్టపోయినట్లు..తెలిపారు. ఇప్పుడు మాత్రం స్విగ్గి, జొమాటోలకి ఆర్డర్ సప్లై ఇవ్వటంతో పరిస్థితి మారిందని.. రద్దీ కూడా తగ్గిందని “క్యూ” సిస్టం లేదని తాజా ఇంటర్వ్యూలో కిర్రాక్ ఆర్పి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.