Jabardasth : జబర్దస్త్‌.. ఇంద్రజ.. ఖుష్బు ల యొక్క పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth : జబర్దస్త్‌.. ఇంద్రజ.. ఖుష్బు ల యొక్క పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Jabardasth : ఒకప్పుడు సినిమాలతో పోలిస్తే బుల్లి తెర పై కనిపించే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. సినిమా స్టార్స్ బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. బుల్లి తెర స్టార్స్ అంటే పెద్దగా క్రేజ్‌ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. సినిమాల్లో కంటే బుల్లి తెర పై ఎక్కువ గుర్తింపు వస్తున్న కారణంగా సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్‌, చిరంజీవి, నాగార్జున మొదలుకొని ఎంతో మంది బుల్లి తెరపై సందడి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :31 December 2022,10:00 am

Jabardasth : ఒకప్పుడు సినిమాలతో పోలిస్తే బుల్లి తెర పై కనిపించే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. సినిమా స్టార్స్ బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. బుల్లి తెర స్టార్స్ అంటే పెద్దగా క్రేజ్‌ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. సినిమాల్లో కంటే బుల్లి తెర పై ఎక్కువ గుర్తింపు వస్తున్న కారణంగా సల్మాన్ ఖాన్, అమితాబచ్చన్‌, చిరంజీవి, నాగార్జున మొదలుకొని ఎంతో మంది బుల్లి తెరపై సందడి చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జ్‌ లుగా వ్యవహరిస్తున్న

ఇంద్రజ మరియు కుష్బూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వీరిద్దరు కొనసాగుతున్నారు. ఇంద్రజ పర్మినెంట్ మల్లెమాల షో ల యొక్క జడ్జ్ గా మారింది. కానీ కుష్బూ మాత్రం అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ వస్తుంది. వీరిద్దరి రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎవరి పారితోషికం ఎంత అనే విషయం పై క్లారిటీ లేదు, కానీ ఇద్దరికీ కూడా జబర్దస్త్ వారు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇద్దరికీ కూడా దక్కుతున్న పారితోషికం తెలిస్తే

jabardasth judge indraja and kushboo remunerations

jabardasth judge indraja and kushboo remunerations

 

జనాలు షాక్ అయ్యేంత అంటూ చర్చ నడుస్తుంది. ఒకప్పుడు రోజాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ స్థాయిలోనే వీరిద్దరికి కూడా ఇస్తున్నారట. రోజా ఏ స్థాయిలో అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిందో ఇంద్రజ కూడా అదే స్థాయిలో జబర్దస్త్ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కనుక ఆమెకు ఆ స్థాయి పారితోషికం ఇవ్వడం కరెక్ట్‌. ఇక కుష్బూ విషయానికి వస్తే తన స్టాండంతో షో కి అందం ని తీసుకొచ్చింది. కనుక ఆమెకు కూడా భారీ పారితోషికం ఇవ్వడం సబబే అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది